ఒక్క ఎపిసోడ్‍తో బిగ్‍బాస్‍ కలర్‍ మారిపోయింది!

బిగ్‍ బాస్‍ సీజన్‍ 4ని వీలయినంత అన్‍ప్రిడిక్టబుల్‍గా వుంచాలని షో డైరెక్టర్లు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. ఒకవేళ ఎవరయినా కంటెస్టెంట్లకు అభిమానులు పెరుగుతున్నారనిపిస్తే వారిని పర్సనల్‍గా టార్గెట్‍ చేస్తూ వీక్‍ అయ్యేట్టు చూస్తున్నారు. ఉదాహరణకు అభిజీత్‍ హౌస్‍లోకి వెళ్లిన తొలినాళ్లలో చాలా కాన్ఫిడెంట్‍గా వుండేవాడు. తనను నామినేట్‍ చేసినా ఎలిమినేట్‍ కాననే ధీమా చూపించేవాడు. అయితే అతడి ఆటను పదే పదే ప్రశ్నించి అతడిలో అనుమానాలు పెంచడంతో ఇప్పుడతను కాన్ఫిడెన్స్ కోల్పోయాడు.

అలాగే సోహైల్‍ ఆవేశాన్ని ఎత్తి చూపించడంతో అతడూ డిఫెన్స్లో పడిపోయాడు. ఇక ఈ షోలో వున్న లేడీ కంటెస్టెంట్లు అందరూ చాలా వీక్‍గా వున్నారు. వీరి పట్ల ఆడియన్స్లో ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడకపోవడంతో ఎప్పుడయినా అవుట్‍ అయ్యేలా వున్నారు. దీంతో బిగ్‍బాస్‍ వ్యూహకర్తలు లేడీ కంటెస్టెంట్లను హైలైట్‍ చేసే ఎపిసోడ్‍ టెలికాస్ట్ చేసారు. చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పుకుంటూ లాస్య, అరియానా, హారిక చెప్పిన తమ పర్సనల్‍ స్టోరీలు ఆడియన్స్ను విశేషంగా కదిలించాయి. వారి పట్ల ప్రేక్షకులలో సింపతీ వచ్చేట్టు చేసాయి.

ఈ వారం కనుక ఎలిమినేషన్‍ తప్పించుకున్నట్టయితే వచ్చేవారం నుంచీ వీరికి ఓటింగ్‍లో ఎడ్జ్ వుంటుంది. వరుసగా ఆడవాళ్లు ఎలిమినేట్‍ అవుతూ వుండడంతో మగాళ్లపై గురి పెట్టడం కోసం బిగ్‍బాస్‍ ఈ ఎత్తు వేసినట్టు అనిపిస్తోంది.