పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఈ సినిమా బద్దలు కొట్టేసింది. ఓవరాల్‌గా కూడా ‘బాహుబలి’ రికార్డులకు ఎసరు పెట్టింది. విడుదలై 40 రోజులకు పైగా దాటినా సరే.. హిందీలో ఈ సినిమా ఇప్పటికీ చెప్పుకోదగ్గ షేర్‌తో సాగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టగా.. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది.
ఇంకొన్ని చోట్ల స్వల్ప నష్టాలు రావచ్చు. ఓవరాల్‌గా బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ‘పుష్ప-2’ మెగా సక్సెస్ అనే చెప్పాలి. కానీ ఈ చిత్రం ఒక్క ఏరియాలో మాత్రం డిజాస్టర్ కావడం పెద్ద షాక్. అల్లు అర్జున్ తాను దత్త పుత్రుడినని, ఇది నా ల్యాండ్ అని చెప్పుకున్న కేరళలో ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఓపెనింగ్స్ దగ్గరే వీక్ అయిన ఈ సినిమా ఆ తర్వాత కూడా ఏ దశలోనూ పుంజుకోలేదు. ఫుల్ రన్లో పది కోట్లకు మించి వసూళ్లు సాధించలేకపోయింది.
బ్రేక్ ఈవెన్ మార్కులో మూడో వంతు మాత్రమే వసూళ్లు రాబట్టిన ‘పుష్ప-2’ డిజాస్టర్ అని తేలిపోయింది. హిందీలో ఇరగాడేస్తున్న తన చిత్రం కేరళలో ఇలా చతికిలబడడం అల్లు అర్జున్‌కు మింగుడు పడకపోవచ్చు. సినిమా మరీ మాస్‌గా ఉందని, వయొలెన్స్ ఎక్కువ ఉందని.. సున్నితమైన చిత్రాలను ఇష్టపడే మలయాళీలకు ఈ సినిమా మింగుడు పడలేదని చెప్పుకోవచ్చు. కానీ పుష్ప-2 తర్వాత వచ్చిన మోస్ట్ వయొలెంట్ యాక్షన్ మూవీ ‘మార్కో’ అక్కడ సెన్సేషనల్ హిట్ అయింది.
అందులో హింస మోతాదు చాలా ఎక్కువ. అది మాస్ మూవీనే. అంత భయానకమైన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు.. పుష్ప-2లోని మాస్, వయొలెన్స్ పెద్ద విషయం కాదు. ఓవైపు ‘పీలింగ్స్’ పాటేమో అక్కడి జనాలను ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఆ పాట మార్మోగుతోంది. కానీ సినిమా మాత్రం ఆదరణకు నోచుకోలేదు.
మొత్తానికి ప్రపంచమంతా అదిరిపోయే సక్సెస్ సాధించినప్పటికీ.. బన్నీకి బలమైన మార్కెట్ ఉందనుకున్న కేరళలో మాత్రం ‘పుష్ప-2’ ఆడకపోవడం పెద్ద మిస్టరీ అనే చెప్పాలి.