సినిమాల్లో నటించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చేమో కానీ నటీనటులు అంతకన్నా ఎక్కువగా కోరుకునేది పేరు ప్రతిష్టలు, అభిమానుల ప్రేమ. ఇవి ఇచ్చే ఆనందం ఇంకేవి అందివ్వలేవు. ఈ రోజు బ్రహ్మ ఆనందం టీజర్ రిలీజ్ వేడుకలో కమెడియన్ వెన్నెల కిషోర్ కు గొప్ప ప్రశంస దక్కింది.
వెయ్యికి పైగా సినిమాల్లో నటించి లెజెండరీ హాస్య నటుడిగా, ఇప్పటితరం మీమ్స్ దేవుడిగా కొలవబడుతున్న బ్రహ్మానందం గారు నా లెగసీని కొనసాగించే వాళ్లలో వెన్నెల కిషోర్ ఉన్నాడని సభా సాక్షిగా చెప్పడం కన్నా ఆనందం ఏముంటుంది. ఇంత ఓపెన్ గా బ్రహ్మి పొడిగారంటే మాములు విషయం కాదు.
కొన్నేళ్లుగా దాదాపు ప్రతి నోటెడ్ సినిమాలో పాత్రలు దక్కించుకుంటున్న వెన్నెల కిషోర్ బ్రహ్మ ఆనందంలో బ్రహ్మానందంతో పాటు వాళ్ళబ్బాయి గౌతమ్ తో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు. టీజర్ కాన్సెప్ట్ ఫన్నీగా ఆసక్తికరంగా ఉంది. ఇందులో భాగంగానే పైన చెప్పిన ప్రశంసల జల్లు కురిసింది.
ఇటీవలే హీరోగా కూడా మారిన వెన్నెల కిషోర్ ఆ మధ్య చారి 111 అనే స్పై డ్రామా చేశాడు. ఆడలేదు కానీ థియేటర్ దాకా వెళ్లిందంటే తన ఇమేజ్ పుణ్యమే. గత నెల శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లో తనది మెయిన్ క్యారెక్టర్ కాకపోయినా నిర్మాతలు కిషోర్ బ్రాండ్ మీద పోస్టర్లు వేసి మార్కెటింగ్ చేసుకున్నారు.
అగ్ర హీరోల నుంచి చిన్న దర్శకుల దాకా అందరికీ మంచి ఛాయస్ అవుతున్న వెన్నెల కిషోర్ నిజంగానే బ్రహ్మానందం లెగసిని కంటిన్యూ చేయడానికి బోలెడు కెరీర్ చేతిలో ఉంది. ఇంతకు ముందులా ఇప్పటి రచయితలు సెపరేట్ గా కామెడీ ట్రాక్స్ రాయడం లేదు.
హీరో హీరోయిన్లతోనే పాటు పక్కనున్న ఫ్రెండ్స్ తో పని కానిస్తున్నారు. అయినా కూడా వెన్నెల కిషోర్ కు అవకాశాలు దక్కుతున్నాయంటే తన టైమింగే కారణం. అన్నట్టు గతంలో వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేసిన సినిమాలో బ్రహ్మానందం కూడా ఉన్నారు. దాని ప్రస్తావనే వద్దని కిషోర్ సైగల ద్వారా బ్రతిమాలుకోవడం సభలో కొసమెరుపు.
This post was last modified on January 16, 2025 4:14 pm
పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు…
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…