ఆరేళ్లు వెనక్కి వెళ్తే.. 2019 సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో బడ్జెట్, అంచనాల పరంగా పెద్ద సినిమా అంటే.. ‘వినయ విధేయ రామ’, యన్.టి.ఆర్: కథానాయకుడు, ఎఫ్-2 తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కానీ బాక్సాఫీస్ ఫలితం మాత్రం తిరగబడింది. ‘ఎఫ్-2’ అంచనాలను మించిపోయి బ్లాక్ బస్టర్ అయింది. ‘వినయ విధేయ రామ’ పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
‘యన్.టి.ఆర్’ సినిమాకు టాక్, ఓపెనింగ్స్ బాగున్నా.. తర్వాత నిలబడలేకపోయింది. చివరికి అదీ ఫ్లాప్ మూవీగానే నిలిచింది. కట్ చేస్తే ఇప్పుడు 2025 సంక్రాంతి వచ్చింది. మళ్లీ అదే ముగ్గురు హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. 2019 సంవత్సరంలో మాదిరే ఈసారి కూడా వెంకీ సినిమానే సంక్రాంతి విజేతగా నిలుస్తుండడం విశేషం.
ముందు నుంచి మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం బంపర్ ఓపెనింగ్స్‌తో మొదలైంది. ఇది సంక్రాంతి విన్నర్‌గా నిలవడం లాంఛనమే. ఐతే మిగతా రెండు చిత్రాల విషయానికి వస్తే.. బాలయ్యకు ఈసారి ఫెయిల్యూర్ ఎదురు కాలేదు. ‘డాకు మహారాజ్’ కూడా బాగా ఆడుతోంది. మాస్ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.
ఇక చరణ్‌కు మాత్రం ‘గేమ్ చేంజర్’ ఒకింత నిరాశనే మిగిల్చేలా కనిపిస్తోంది. ‘వినయ విధేయ రామ’ లాగా ఈ చిత్రానికి పూర్తి నెగెటివ్ టాక్ ఏమీ రాలేదు. కానీ టాక్ మరీ గొప్పగా కూడా లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పడుతూ లేస్తూ సాగుతోంది. వసూళ్లు యావరేజ్‌గా ఉన్నాయి కానీ.. అంతిమంగా బాక్సాఫీస్ టార్గెట్లను ఈ చిత్రం అందుకునేలా కనిపించడం లేదు.
నిర్మాతకు, బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. 2019తో పోలిస్తే ఓవరాల్‌గా ఈ సంక్రాంతి ఫలితాలు బెటరే. కానీ అప్పట్లాగే ఈసారి కూడా వెంకీ సినిమా పండుగ విజేతగా నిలుస్తోంది. ‘ఎఫ్-2’ అప్పట్లో 80 కోట్లకు పైగా షేర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ దాని మీద ఇంకో 50 శాతం అదనపు షేర్ రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on January 16, 2025 9:14 am
సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ…
సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్…
ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర…
ఇండియన్ స్పిల్బర్గ్ గా అభిమానులు పిలుచుకునే దర్శకుడు శంకర్ కొన్నేళ్లుగా తన ముద్ర వేయలేకపోవడం చూస్తున్నాం. 2.0కి ప్రశంసలు వచ్చాయి…
దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్రపంచశాంతిని ప్రశ్నార్థకంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ…
ఒకప్పుడు నిలకడగా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర నిర్మాత దిల్ రాజు.. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది…