Movie News

వెంకీ కంబ్యాక్ : ఏడాదిలో ఎంత తేడా?

టాలీవుడ్లో సంక్రాంతికి ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసిన స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. గతంలో ఈ పండక్కి ఆయన చరిత్రలో నిలిచిపోయే సినిమాలను అందించారు. తర్వాతి తరం హీరోల ఆధిపత్యం మొదలయ్యాక కూడా వెంకీ అప్పుడప్పుడూ సంక్రాంతికి సినిమాలు వదులుతూనే ఉన్నారు. 2019లో ఆయన సినిమా ‘ఎఫ్-2’ సెన్సేషనల్ హిట్ అయింది. ఆ తర్వాత వెంకీ మళ్లీ సంక్రాంతి బరిలో నిలిచింది గత ఏడాది ‘సైంధవ్’ మూవీతోనే.

‘హిట్’ సిరీస్‌తో మంచి పేరు సంపాదించిన శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ముందు ఈ మూవీ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించింది. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి హైప్ తగ్గిపోయింది. ఇక బ్యాడ్ టాక్ వచ్చేసరికి సినిమా బాక్సాఫీస్ దగ్గర అస్సలు నిలబడలేకపోయింది. ఫుల్ రన్లో ‘సైంధవ్’ ఏడెనిమిది కోట్లకు మించి షేర్ రాబట్టలేకపోయింది. కానీ ఏడాది తిరిగేసరికి విక్టరీ వెంకటేష్ దశ తిరిగిపోయింది.

ఈ సంక్రాంతికి రిలీజైన వెంకీ కొత్త చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతోంది.అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే తిరుగులేని జోరు చూపించిన ఈ చిత్రం.. తొలి రోజు అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది రూ.40 కోట్లకు పైగా గ్రాస్, రూ.25 కోట్ల మేర షేర్ రాబట్టింది. ‘సైంధవ్’ సినిమా ఫుల్ రన్లో సాధించిన షేర్‌తో పోలిస్తే కేవలం ఒక్క రోజులోనే మూడు రెట్ల షేర్ రాబట్టిందంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఏ రేంజ్ సక్సెస్ అన్నది అర్థం చేసుకోవచ్చు.

దీన్ని బట్టే వెంకీకి ఎలాంటి సినిమాలు బాగా సూటవుతాయన్నది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఆయన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో చూడ్డానికే ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ‘ఎఫ్-2’కు సైతం భారీ విజయాన్ని అందించారు ప్రేక్షకులు. కాబట్టి వెంకీ మిగతా జానర్ల కంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో నటించడానికే మొగ్గు చూపితే బెటర్.

గతంలో కూడా ‘కలిసుందాం రా’ సహా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో వెంకీ ఘనవిజయాలు అందుకున్నారు. కాబట్టి ఇక ముందూ కుటుంబ కథా చిత్రాలకే ఆయన ప్రాధాన్యం ఇవ్వడం ఖాయం.

This post was last modified on January 16, 2025 8:32 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

40 minutes ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

42 minutes ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

4 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

5 hours ago