పండక్కు రిలీజై హిట్టు కొట్టిన రెండు సినిమాల్లో చైల్డ్ ఎలిమెంట్ కీలక పాత్ర పోషించడాన్ని కొట్టిపారేయలేం. ముందుగా డాకు మహారాజ్ సంగతి చూస్తే శ్రద్ధ శ్రీనాథ్ కూతురిగా నటించిన పాప పేరు వేద అగర్వాల్. స్వస్థలం ఆగ్రా అయినప్పటికీ వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ లో స్థిరపడిందట.
ఇంతకు ముందు వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునలో చిన్న పాత్ర చేసింది. సన్నీడియోల్ జాత్ లోనూ ఉందట. బాలయ్యతో తన ఆన్ స్క్రీన్ బాండింగ్ ఎంత బాగా వచ్చిందో చూశాం. వయసు చిన్నదే అయినా పెర్ఫార్మన్స్ పరంగా వేద అగర్వాల్ ఎక్స్ ప్రెషన్లు, నటన ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇక సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ కొడుకు బుల్లిరాజుగా నటించిన బుడ్డోడి పేరు రేవంత్ భీమల. బందరు లడ్డులా బొద్దుగా క్యూట్ గా ఉండే ఈ పిల్లాడు ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లలో దుమ్ము దులిపేశాడు. ముఖ్యంగా నాన్న మీద మాటల దాడి చేయడానికి వచ్చిన గ్రామస్థులను క్లాసు పీకే ఎపిసోడ్లో నవ్వని ఆడియన్స్ థియేటర్లో లేరంటే అతిశయోక్తి కాదు.
ఇంకో సన్నివేశంతో తాత ఫ్రెండుకు ఇచ్చే కౌంటర్ కి ఘొల్లుమనని వాళ్ళు లేరు. ఇంకా ఇతని వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది కానీ సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ గురించి మాట్లాడకుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఇలా ఇద్దరు బుల్లి స్టార్లు రెండు బ్లాక్ బస్టర్లలో భాగం కావడం కాకతాళీయమే అయినా చెప్పుకోదగ్గ విశేషమే. గేమ్ ఛేంజర్ లోనూ పిల్లల ట్రాక్ ఒకటి ఉంది కానీ దానికి తగినంత స్కోప్ లేకపోవడంతో దర్శకుడు శంకర్ ఫ్లాష్ బ్యాక్ లో దాన్ని మొక్కుబడిగా చూపించి అప్పన్నని హైలైట్ చేశారు.
కలెక్షన్ల పరంగా సంక్రాంతికి వస్తున్నాం పూర్తిగా డామినేట్ చేస్తుండగా రెండో స్థానంలో డాకు మహారాజ్ దూసుకెళ్లే పనిలో ఉన్నాడు. వసూళ్లు దేనికవే పోటాపోటీగా ఉన్నాయి. విజేత ఎవరు కాబోతున్నారనేది ప్రాథమికంగా కనిపిస్తోంది కానీ ఫైనల్ స్టేటస్ అయ్యాకే రియల్ విన్నర్ ని ప్రకటించొచ్చు. చూడాలి ఎవరవుతారో.
This post was last modified on January 15, 2025 2:14 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…