ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్‌లో ఆలస్యం జరిగి.. 2013 సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌కు రెడీ అయింది. కానీ కొన్ని సమస్యలు తలెత్తి ఆ ఏడాది విడుదల కాలేదు. తర్వాత ఏం జరిగిందో ఏమో.. ఎంతకీ ఈ సినిమాకు మోక్షం కలగలేదు. ఇక ఎఫ్పటికీ విడుదల కాదు అనుకున్న ఈ సినిమాను అనూహ్యంగా ఈ సంక్రాంతికి రేసులోకి వచ్చింది.
ఐతే పుష్కర కాలం కిందట రిలీజ్ కావాల్సిన సినిమా.. ఇప్పుడు వస్తోందంటే సాధారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ తమిళనాట మాత్రం ‘మద గజ రాజా’కు అనూహ్యంగా బజ్ క్రియేట్ అయింది. అయినా సరే.. పొంగల్‌కు చాలా సినిమాలు పోటీలో ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఏమాత్రం నిలబడుతుందో అనుకున్నారు. కానీ ఈ సినిమా పోటీని తట్టుకుంది. ఒక కొత్త సినిమా తరహాలోనే వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది.
తొలి రెండు రోజుల్లో ‘మద గజ రాజా’ రూ.10 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. మూడో రోజు వసూళ్లు ఇంకా పెరిగాయి. రూ.6 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి. ఇలాంటి పాత సినిమాకు తొలి రెండు రోజుల కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రావడం అనూహ్యం. తమిళంలో సంక్రాంతికి అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. దీని వల్ల థియేటర్ల సమస్య తప్పలేదు.
‘మద గజ రాజా’కు ఉన్న టికెట్ల డిమాండుకు.. అందుబాటులో ఉన్న స్క్రీన్లు సరిపోవడం లేదని ట్రేడ్ వర్గాలు అంటుండడం విశేషం. స్క్రీన్లు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రాన్ని యుఎస్‌లో రిలీజ్ చేయకపోవడం పట్ల అక్కడి ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అక్కడా సినిమాను అందుబాటులోకి తేవాలంటున్నారు.
విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో సుందర్.సి ఈ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా కథాకథనాలు రొటీన్ అయినప్పటికీ.. కామెడీకి, యాక్షన్ సన్నివేశాలకు, హీరోయిన్ల గ్లామర్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కామెడీ వేషాలు వదిలేసి హీరో పాత్రలకు పరిమితం అయిన సంతానం.. ఇందులో తన మార్కు కామెడీతో అదరగొట్టడాడని అంటున్నారు. సంతానం కామెడీకి దూరం కావడం పెద్ద తప్పు అని ఈ చిత్రం రుజువు చేస్తోంది.
This post was last modified on January 15, 2025 3:01 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…