క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత ఏడాది ఈటీవీ విన్ లో రిలీజైన వెబ్ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. సగటు మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ముగ్గురు పిల్లలతో ఆ ఫ్యామిలీలో నడిపించిన డ్రామా దర్శకుడు ఆదిత్య హాసన్ కు మంచి పేరు తీసుకొచ్చింది.
ముఖ్యంగా చిన్న కొడుగ్గా నటించిన రోహన్ రాయ్ పాత్ర ఓ రేంజులో బ్లాస్టయ్యింది. తనకు తండ్రిగా చేసిన శివాజీ మధ్య సన్నివేశాలు మాములుగా పేలలేదు. ఇప్పుడు దీనికి కొనసాగింపు వస్తోంది.
అంటే చిచ్చర పిడుగు రోహన్ రాయ్ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ అయ్యాడు. అమ్మా నాన్నలకు జుట్టు కాస్త తెల్లబడి వాళ్లే ఉంటారు. కాకపోతే ఈసారి కుటుంబ కష్టాలు కాకుండా ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుందట. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్యని ఆ కుర్రాడిని ప్రేమించే అమ్మడిగా చూడబోతున్నాం.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ దీన్ని నిర్మించబోతున్నారు. అనౌన్స్ మెంట్ టీజర్ వెరైటీగా కట్ చేయడం ఆకట్టుకునేలా ఉంది. ఖుషి, హాయ్ నాన్నతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హేశం అబ్దుల్ వహాబ్ దీనికి సంగీతం అందిస్తున్నారు. టైటిల్ ఇంకా ప్రకటించలేదు. ట్యాగ్ మాత్రం పెట్టారు.
మొత్తానికి ఈ వెరైటీ ప్రయోగం బాగుంది. ఓటిటి కంటెంట్ కి థియేటర్ కొనసాగింపు మంచి ఆలోచన. గతంలో మా ఊరి పొలిమేర సీక్వెల్ కి ఈ ఫార్ములా వాడి విజయం సాధించిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు అదే తరహాలోనే ప్లాన్ చేసుకోవడం వర్కౌట్ అయ్యేలా ఉంది.
ఆనంద్, వైష్ణవి కాంబోలో గతంలో బేబీ నిర్మాతలు ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు కానీ తర్వాత అది వేరే హీరోకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆదిత్య హాసన్ రాసుకున్న కథకు దానికి సంబంధం లేదు. ఏది ఏమైనా న్యూ జనరేషన్ డైరెక్టర్లు అవుట్ అఫ్ ది బాక్స్ ఆలోచించడం సృజనాత్మక కోణంలో చాలా అవసరం.
This post was last modified on January 15, 2025 12:08 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…