Movie News

మామ బాలయ్య మూవీ చూసిన అల్లుడు లోకేష్!

తెలుగు నేల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి వేడుకల కోసం కుటుంబ సమేతంగా తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ కూడా ఆదివారం సాయంత్రానికే చంద్రగిరి చేరుకోగా… లోకేశ్ కుమారుడు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఏటా సంక్రాంతి సంబరాల కోసం చంద్రబాబు చంద్రగిరి పరిధిలోని తన సొంతూరుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా నందమూరి ఫ్యామిలీలోని చాలా మంది ప్రముఖులు సంక్రాంతి వేడుకల కోసం చంద్రగిరికి వచ్చారు. లోకేశ్ సతీమణి బ్రాహ్మణి సోదరి తేజస్విని తన భర్త, విశాఖ ఎంపీ భరత్ తో కలిసి నారావారిపల్లె చేరుకున్నారు. వెరసి నారావారిపల్లెతో పాటుగా చంద్రగిరి పరిసరాలన్నీ సంబరాలతో హోరెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే… ఈ సంక్రాంతికి హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ విడుదలై విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఈ సినిమా విజయంతో సంక్రాంతి వేడుకలను ఓ రేంజిలో జరుపుకుంటూ ఉండగా…బాలయ్య సినిమాను లోకేష్ ప్రత్యేకంగా తిలకించారు. ఇందుకోసం లోకేష్ స్వయంగా సినిమా థియేటర్ కు వెళ్లడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్ లో డాకు మహారాజ్ సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ సినిమాను వీక్షించేందుకు లోకేష్ కుటుంబంతో కలిసి థియేటర్ కు కదలివెళ్లారు. లోకేశ్ బ్రహ్మణి దంపతుల వెంట ఎంపీ శ్రీభరత్ దంపతులు, బాలయ్య సోదరుడు రామకృష్ణ, నారావారిపల్లెకు చెందిన చంద్రబాబు దగ్గరి బంధువులు చాలా మందే బాలయ్య సినిమాను చూసేందుకు వెల్లారు.

పల్లెల్లో ఉండే సినిమా హాళ్లల్లో మాదిరిగా… లోకేష్ బృందంలో మగాళ్లంతా ఒక దరిన కూర్చోగా… ఆడవాళ్లంతా మరో చోట కూర్చుని సినిమాను ఎంజాయ్ చేశారు.

This post was last modified on January 13, 2025 5:29 pm

Share

Recent Posts

పాపం అల్లు శిరీష్.. ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…

34 minutes ago

ట్విస్ట్…. నారాయణమ్మకు మూలం నవనీతమ్మ ?

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…

1 hour ago

రిక్షా తోలుకోమంటున్న డిప్యూటీ సీఎం…

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…

2 hours ago

ఆ రోడ్డుపై వైసీపీ దుష్ప్రచారం.. ఖండించిన డిప్యూటీ సీఎంవో

ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…

3 hours ago

చీకట్లో మొబైల్‌ చూస్తున్నారా.. ఈ డేంజర్‌ గురించి తెలుసుకోండి..

రాత్రి నిద్రపోయే ముందు ఫోన్‌ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్‌ స్క్రీన్‌…

3 hours ago

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

4 hours ago