ఒకప్పుడు హిందీలో తెలుగు హీరోల డబ్బింగులు రిలీజ్ చేయాలంటే పెద్ద రిస్క్. కనీస ఆదరణ దక్కుతుందో లేదోననే అనుమానం నిర్మాతలకు వెనక్కు లాగేది. సీనియర్ హీరోలు బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ చేసి హిట్లు కొట్టినా అవి మరీ పెద్ద రేంజ్ కు చేరుకోలేకపోయాయి. కానీ బాహుబలి నుంచి పుష్ప దాకా సీన్ మొత్తం మారిపోయింది.
ఎంతగా అంటే ఉత్తరాది రాష్ట్రాల థియేటర్లు, మల్టీప్లెక్సులు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకు మన సౌత్ డబ్బింగ్ లే ప్రాణవాయువయ్యేంత. ఒకరకంగా చెప్పాలంటే ఆపద్బాంధవుడి పాత్రను పోషిస్తున్నట్టే. అదెలాగో 2024 ఆర్ మ్యాక్స్ బాక్సాఫీస్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది.
ఇండియాలో గత ఏడాది మొత్తం అన్ని బాషల బాక్సాఫీస్ గ్రాస్ 12 వేల కోట్లు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 167 కోట్లు ఎక్కువ. కేవలం హిందీనే పరిగణనలోకి తీసుకుంటే 4679 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. అందులో 31 శాతం డబ్బింగ్ సినిమాలే. ఒక్క పుష్ప 2 ది రూల్ హిందీ వెర్షనే 889 కోట్లు ఇచ్చింది.
స్ట్రెయిట్ సినిమాలనే పరిగణనలోకి తీసుకుంటే బాలీవుడ్ మొత్తం గ్రాస్ 37 శాతం తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయం. స్త్రీ 2, ముంజ్యా, భూల్ భులయ్యా 2 లాంటి దెయ్యాల చిత్రాలు ఆదుకోబట్టి సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదనే మాట వాస్తవం.
తెలుగు చూసుకుంటే స్థిరంగా 15 నుంచి 20 శాతం ఎదుగుదల ఉండటం విశేషం. కల్కి 2898 ఏడి, దేవర, పుష్ప 2 లాంటివి ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కావడం దీనికి దోహదం చేసింది. ఇప్పుడీ 2025లోనూ హిందీ మార్కెట్ సౌత్ మీదే ఆశలు పెట్టుకుంది.
హరిహర వీరమల్లు, విశ్వంభర. కోహినూర్, ది రాజా సాబ్, ఫౌజీ లాంటివి మన స్థాయిని మరింత పైకి తీసుకెళ్ళబోతున్నాయి. ఇక్కడ మిక్స్డ్ టాక్ తో పోరాడుతున్న గేమ్ ఛేంజర్ హిందీలో మంచి వసూళ్లతో రన్ కావడం మన సినిమాలకు వాళ్ళెంత కనెక్ట్ అవుతున్నారో చెప్పేందుకు సరిపోయే ఉదాహరణ. క్రికెట్ కి ఐసిసి లాగా భారతీయ సినిమాకు టాలీవుడ్ అవుతుందేమో.
This post was last modified on January 13, 2025 2:10 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…