ఒక సినిమా ల్యాబులో పన్నెండు సంవత్సరాలు మగ్గి అసలు రిలీజవుతుందో లేదోనని ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకుంటే ఎవరైనా దాని కోసం ఎదురు చూడటం మానేస్తారు. మదగజరాజా అలాంటి బాపతు కిందకే వస్తుందని అందరూ భావించారు. కట్ చేస్తే నిన్న విడుదలైన ఈ మూవీకి తమిళంలో అనూహ్య మద్దతు దక్కింది.
నిన్న ఒక్క రోజే బుక్ మై షోలో 80 వేల దాకా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోవడమంటే మాటలు కాదు. పొంగల్ పండక్కు థియేటర్ వినోదాన్ని ప్రధానంగా భావించే అరవ ప్రేక్షకులు మొదటి ఛాయస్ గా దీన్నే పెట్టుకుని పొలోమంటూ హౌస్ ఫుల్స్ చేస్తున్నారు.
అలాని మదగజరాజ ఏదో అవుట్ అఫ్ ది బాక్స్ ట్రెండ్ సెట్టర్ అనుకునేరు. అలాంటిదేమీ లేదు. రొటీన్ ఫార్ములాతో అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా దర్శకుడు సుందర్ సి 2012కే ఇది కొంచెం అవుట్ డేటెడ్ అనిపించేలా తీశాడు. కాకపోతే ఇలాంటి ఫన్ గత కొన్నేళ్లలో ఎవరూ ఇవ్వకపోవడంతో జనాలు దీన్నే ఎంజాయ్ చేస్తున్న వైనం కనిపిస్తోంది.
వరలక్ష్మి శరత్ కుమార్ కి ఇది రెండో సినిమా. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ తల్లిగా వయసు మళ్ళిన పాత్రలో కనిపించిన అంజలి మదగజరాజలో గ్లామర్ షో చేయడం వెరైటీ ట్విస్టు. మొత్తానికి భోజనం రుచిగా లేకపోయినా ఆకలి తీర్చిన ఘనత మదగజరాజకు దక్కింది.
ఇక విశాల్ సంగతికొస్తే వరస ఫ్లాపులతో పాటు కొంచెం అనారోగ్యం కారణంగా డీలా పడిన ఇతనికి మదగజరాజ రెస్పాన్స్ మంచి కిక్ ఇచ్చిందని సన్నిహితుల మాట. లుక్స్ పాతవే అయినప్పటికీ ఎనర్జీ అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉంటుందని, తను ఎలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్ ఆదరిస్తారో మదగజరాజ ఋజువు చేసిందని అంటున్నారు.
సో గత కొన్నేళ్లుగా ప్రయోగాల బాట పట్టిన విశాల్ మళ్ళీ రూట్ మారుస్తాడేమో చూడాలి. ఇక బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కంపోజ్ చేసిన పాటలు, బిజిఎం ఈ సినిమాని నిలబెట్టింది. అన్నట్టు త్వరలోనే తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు.
This post was last modified on January 13, 2025 12:35 pm
ఒక సూపర్ స్టార్ కొడుకు సినిమాల్లోకి వచ్చాడంటే.. తండ్రి పేరును వీలైనంతగా వాడుకోవడానికే ప్రయత్నిస్తాడు. నటనలో తండ్రిని అనుకరించడం.. తన…
కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్న మాట వాస్తవమేనని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. దీనిని అడ్డు పెట్టుకుని…
వైసీపీ అధినేత జగన్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజకీయంగా పోరాటమే తప్ప.. ఎప్పుడూ ఆయన…
అందంగా కనిపించాలనే కోరికతో చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయని చెప్పే…
రామాయణ పార్ట్ 1 వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసినా సినిమాలో నటన పరంగా ఎక్కువ పేరు వచ్చింది యష్,…
వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా…