నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మినిమం ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. ఆయన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు కథ పరంగా ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. కథానాయికలను గ్లామర్ డాల్స్‌గానే చూపిస్తుంటారు. ఐతే బాలయ్య కొత్త చిత్రం ‘డాకు మహారాజ్’లో ముగ్గురు హీరోయిన్లు ఉండడంతో వాళ్లు ఏ స్థాయిలో గ్లామర్ విందు చేస్తారా అని ఎదురు చూశారు అభిమానులు. ఐతే దర్శకుడు బాబీ ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాడు.
గ్లామర్ తారగా గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైశ్వాల్‌ను ఆ కోణంలో అస్సలు చూపించలేదు. ఇందులో ఆమెకు ఉన్నవి తక్కువ సన్నివేశాలే అయినా.. పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్నవే. అందులో ఆమె రాణించింది. బాలయ్యకు భార్యగా కనిపించిన ప్రగ్యాతో ఒక డ్యూయెట్ అయినా ఉంటుందేమో అనుకున్నారు ప్రేక్షకులు. కానీ బాబీ అలాంటి ప్రయత్నమే చేయలేదు.
ఇక ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేస్తూ అవసరమైనపుడు గ్లామర్ యాంగిల్ కూడా చూపించే శ్రద్ధా శ్రీనాథ్‌ను కూడా పూర్తిగా ట్రెడిషనల్ రోల్‌లోనే చూపించాడు బాబీ. అసలు అందరూ అనుకున్నట్లు ఆమె సినిమాలో రెండో హీరోయిన్ కాదు. బాలయ్యకు జోడీగా నటించలేదామె. ఆమె ఎవరి సరసన నటించింది, బాలయ్యకు ఏమవుతుంది అన్నది ట్విస్ట్. అదేంటో సినిమాలోనే చూడాలి.
ఆమె పాత్ర చివరికి టర్న్ తీసుకునే తీరు చూశాక ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. బాబీ లాంటి మాస్ డైరెక్టర్ ఇద్దరు మెయిన్ హీరోయిన్లను గ్లామర్ కోసం, పాటల కోసం వాడకుంటే ఇద్దరికీ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇక ఊర్వశి రౌటెలా విషయానికి వస్తే ఆమె జస్ట్ ఐటెం సాంగ్‌కు పరిమితం కాలేదు. ఆమెకు ఇందులో ఒక పాత్ర ఉంది. ప్రథమార్ధమంతా ఆమె పాత్ర కనిపిస్తుంది. సన్నివేశాల్లోనే కాక.. దబిడి దిబిడి పాటలోనూ ఆమె బాగానే అందాలు ఆరబోసింది.
This post was last modified on January 13, 2025 11:16 am
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…