ఎప్పుడూ చాలా హుషారుగా కనిపించే తమిళ హీరో విశాల్.. వారం కిందట తన సినిమా ‘మదగజరాజా’ ప్రమోషనల్ ఈవెంట్లో కనిపించిన తీరు చూసి అందరూ షాకైపోయారు. ఎన్నడూ లేని విధంగా బాగా సన్నబడిపోయిన విశాల్.. చేతితో మైక్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. చెయ్యి అంతగా వణుకుతూ కనిపించింది. తన ముఖంలో కూడా మార్పు కనిపించింది.
ఉన్నట్లుండి వయసు మీద పడ్డ సంకేతాలు కనిపించాయి. మొత్తంగా తన ఆరోగ్య పరిస్థితి పట్ల అందరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. విశాల్ హై ఫీవర్‌తో బాధ పడుతున్నట్లుగా కొందరు పోస్టులు పెట్టారు. అతడికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రి సైతం ఇదే తీరులో పత్రికా ప్రకటన ఇచ్చింది. ఐతే కేవలం తీవ్ర స్థాయిలో జ్వరం ఉన్నంత మాత్రాన మనిషి ఇలా అయిపోతాడా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
విశాల్ తీవ్ర ఆరోగ్య సమస్యతోనే బాధ పడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమస్య ఏదైనప్పటికీ విశాల్ త్వరగా మామూలు మనిషి కావాలని అందరూ కోరుకున్నారు. అభిమానులు తన విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఐతే వారి ఆందోళనకు తెరదించుతూ.. విశాల్ తాజాగా మామూలు మనిషై కనిపించాడు. ‘మదగజరాజా’ ప్రిమిర్ షో కోసం వచ్చిన విశాల్‌ను చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇంకా కొంచెం డల్‌నెస్ ఉంది కానీ.. గత వారం కనిపించినట్లయితే లేడు. ఈసారి అతడి మాట తడబడలేదు. మైక్ పట్టుకున్నపుడు అతడి చేతులు వణకలేదు. తన ఆరోగ్యం గురించి అతను పరోక్షంగా స్పందించాడు. ‘‘ఇప్పుడు నా చేతులు వణకట్లేదు. మైక్ కూడా సరిగా పట్టుకోగలుగుతున్నా. ఇటీవల మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నా తుది శ్వాస వరకు మీ అభిమానాన్ని మరిచిపోలేరు.
ఎంతోమంది గెట్ వెల్ సూన్ అని, కమ్ బ్యాక్ అని సందేశాలు పెట్టారు. వాటి వల్లే నేను కోలుకున్నా. మా నాన్న వల్లే నేను ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతున్నా. నేను గ్యాప్ లేకుండా ఆరు నెలలకు ఒక సినిమా చేసుకుని వెళ్లిపోతున్నానని.. విశ్రాంతి అవసరమని కొందరు సూచించారు. ప్రస్తుతానికి నాకు ఎలాంటి సమస్యలు లేవు. అంతా బాగానే ఉంది’’ అని విశాల్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on January 13, 2025 10:56 am
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…