Movie News

మంచి క్యాస్టింగ్ ను వాడకుండా వదిలేశారా?

గేమ్ ఛేంజర్ బడ్జెట్ అంతగా ఎందుకు పెరిగిపోయిందనే దానికి సవాలక్ష కారణాలున్నాయి కానీ వాటిలో ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి పాట ఫస్ట్ షాట్, పెళ్లిలో డిన్నర్ సీన్ దగ్గర కొద్దిసేపు కనిపించే ప్రియదర్శి తర్వాత ఎక్కడా కనిపించడు. ఎడిటింగ్ లో తీసేసి ఉండొచ్చు కానీ పొటెన్షియాలిటీ ఉన్న ఇలాంటి నటులను వాడుకోకపోవడం పొరపాటు కంటే తప్పే అవుతుంది.

ఎందుకంటే ప్రియదర్శి చిన్నా చితక క్యాస్టింగ్ కాదు. సోలో హీరోగా సారంగపాణి జాతకం లాంటి సినిమాలు చేస్తున్నాడు. బలగం తర్వాత తన మార్కెట్ పెరిగింది. డార్లింగ్ తీసింది హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ నిర్మాతలు.

ప్రియదర్శి ఒక్కడే కాదు సీనియర్ నరేష్ ని సైతం కేవలం ఒక్క సన్నివేశానికి పరిమితం చేశాడు. రామ్ చరణ్ ఇంటికి వచ్చాక భోజనం దగ్గర రెండు ముక్కలు మాట్లాడ్డం తప్ప మళ్ళీ ఎక్కడా కనిపించడు. అప్పన్న కొడుకైన రామ్ నందన్ ఇతని దగ్గరికి ఎలా వచ్చాడనే దాన్ని సరిగ్గా జస్టిఫై చేయలేదు.

కమెడియన్ సత్య, వైవా హర్షలకు సైతం ఇదే ట్రీట్మెంట్. గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రియదర్శి చరణ్ తో కలిసి పని చేయడం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. తనకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. తీరా చూస్తే ఎవరో చెబితే తప్ప నిజంగా ఉన్నాడని గుర్తించలేనంత నిర్లక్షమైన స్పేస్ దొరికింది.

ఇలా సినిమా మొత్తం మొక్కుబడిగా ఉన్న వాళ్ళలో థర్టీ ఇయర్స్ పృథ్వి, రఘుబాబు, శుభలేఖ సుధాకర్ లాంటి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు చాలానే ఉన్నారు. వీళ్ళందరూ తక్కువ రెమ్యునరేషన్ కు వచ్చే టైపు కాదు. డిమాండ్ ఉన్నోళ్లు. రెగ్యులర్ పారితోషికమే ఇచ్చి తీసుకుని ఉంటారు.

ఇదంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. చరణ్, ఎస్జె సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం తప్ప ఇంకెవరూ కనిపించనంతగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇది రాంగని చెప్పలేం కానీ తారాగణాన్ని సరైన రీతిలో వాడుకోకపోవడం ముమ్మాటికీ కాస్ట్లీ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. శంకర్ లాంటి అనుభవజ్ఞులు ఈ పాయింట్ ఎలా మిస్సయ్యారో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

This post was last modified on January 11, 2025 8:19 pm

Share

Recent Posts

ఇన్‌స్పైరింగ్… 70 వయసు దగ్గరలో 7 సినిమాలు

మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…

7 hours ago

ఫోక్ డ్యాన్స‌ర్ల ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌… ర‌చ్చ ర‌చ్చ‌

భ‌ర్త ఎవ‌రితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వ‌స్తుంది. విష‌యం రూఢి చేసుకుంటుంది. భ‌ర్త‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ.. ప‌రాయి మ‌హిళ‌తో…

7 hours ago

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…

7 hours ago

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల రేట్లు పెరుగుతాయా?

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైన‌పుడు అద‌న‌పు…

8 hours ago

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…

10 hours ago

ఇరుకైన మనసుంటే థియేటర్లు ఎలా వస్తాయి

మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…

10 hours ago