టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం పుష్ప 2 సినిమా భారీ హిట్ గా నిలిచి… భారత చలన చిత్ర రికార్డులను తిరగరాస్తోంది. అయినా కూడా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తన అభిమాని ఒకరు చనిపోవడం, దానిపై కేసులు నమోదు కావడం, ఏకంగా తాను ఓ రాత్రంతా జైలులో గడపాల్సి రావడం, తెలంగాణ సర్కారుతో అనవసరంగా రేగిన వివాదం… ఇలా అన్నీ ఒకే సారి మీద పడటంతో సక్సెస్ ఫీల్ అతడు అనుభవించలేకపోతున్నాడు. ఏదో కోల్పోయిన వాడిలా ఇంటి ఆవరణలో ఒక్కడూ కూర్చుని కుమిలిపోతున్న అతడికి శనివారం నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
ఇప్పటికే బన్నీకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు..ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని ఓ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా అతడికి ఓ కండీషన్ పెట్టింది. ఈ క్రమంలో అడుగు బయటపెట్టలేని పరిస్థితిని పంటి బిగువుననే భరిస్తూ వస్తున్న బన్నీ… గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చారు. రేపు ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో అతడికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది.
బన్నీకి బెయిల్ ఇచ్చిన సందర్భంగా పెట్టిన షరతులను సడలిస్తూ నాంపల్లి కోర్టు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. అంతేకాకుండా… విదేశాలకు వెళ్లకుండా బన్నీకి విధించిన షరతును కూడా ఎత్తివేస్తూ… విదేశాలకు వెళ్లాలనుకున్నా వెళ్లొచ్చంటూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. అటు పోలీస్ స్టేషన్ కు వెళ్లే అవసరం లేకుండా… ఇటు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించడంతో బన్నీకి భారీ ఊరట లభించిందని చెప్పక తప్పదు.
This post was last modified on January 11, 2025 1:53 pm
అలేఖ్య చిట్టి పికిల్స్.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి దీని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రాజమండ్రికి చెందిన…
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా ఆమె మీడియాతో…
సమాజంలోని ఏ కుటుంబమైనా.. తమకు ఓ గూడు కావాలని తపిస్తుంది. అయితే.. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పేదలు,.. అత్యంత…
అసలు బాలీవుడ్ లోనే కనిపించడం మానేసిన సీనియర్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హఠాత్తుగా టాలీవుడ్ క్రేజీ అవకాశాలు పట్టేస్తుండటం ఆశ్చర్యం…
వైసీపీలో ఇప్పటి వరకు ఓ మోస్తరు నేతలను మాత్రమే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు పెద్ద తలకాయల జోలికి…
ఎంత హీరోలతో పని చేస్తున్నా సరే ఆయా దర్శకులకు అంత సులభంగా వాళ్ళ ప్రేమ, అభిమానం దొరకదు. ఒక్కసారి దాన్ని…