నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో అభిమానులు, బయ్యర్లున్నారు. ఇవాళ నిర్మాణ సంస్థ ఎస్విసి అధికారికంగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 186 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రకటించడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దేవర కంటే ఫస్ట్ డే పది కోట్ల కంటే ఎక్కువ రావడం నమ్మశక్యంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంద నుంచి నూటా పాతిక కోట్ల దాకా వచ్చే అవకాశం ఉండగా మరీ ఇంతగా జోడించారనే కామెంట్స్ సోషల్ మీడియాలో బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఎంత పెద్ద సినిమాకైనా ఇంతే కలెక్షన్లు వచ్చాయని చెప్పేందుకు ఎలాంటి అఫీషియల్ సోర్స్ లేదు. డిస్ట్రిబ్యూటర్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ట్రాకర్స్ తమ దగ్గరున్న సమాచారాన్ని క్రోడీకరించి నెంబర్లు పెడుతుంటారు. ఎక్కువో తక్కువో వీటితో దగ్గరగా మ్యాచ్ అయ్యేలా ప్రొడక్షన్ ఆఫీస్ పోస్టర్లు వస్తాయి. కానీ గేమ్ ఛేంజర్ కు అలా జరగలేదన్నది డిస్ట్రిబ్యూటర్ వర్గాల టాక్. నిజా నిజాలు నిర్ధారించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఎస్విసి చెప్పిన 186 కోట్ల నెంబరే చెలామణిలోకి వస్తుంది. దీని సంగతి ఎలా ఉన్నా ఉత్తరాది బుకింగ్స్ ఊపందుకున్న ట్రెండ్ కనిపిస్తోంది.
ఇప్పుడు దీని గురించే ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. గేమ్ ఛేంజర్ స్పందన మరీ అన్యాయంగా లేకపోయినా డిజాస్టర్ తరహాలో ప్రొజెక్ట్ అవుతున్న విధానాన్ని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సినిమా చాలా బాగుందని చెప్పడం లేదని కానీ ఇలా కొందరు ఉద్దేశపూర్వకంగా నెగటివ్ క్యాంపైన్ చేయడం గురించి అడుగుతున్నారు. ఇది దేవర, పుష్ప 2, కల్కి, గుంటూరు కారం లాంటి వాటికి కూడా జరిగింది కానీ గేమ్ ఛేంజర్ కు కాస్త ఎక్కువ మోతాదు అయ్యిందనేది వాళ్ళ వెర్షన్. ఏది ఎలా ఉన్నా ఒకవేళ సక్సెస్ మీట్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే అప్పుడే ఓపెనింగ్ గురించి ఏమైనా చెబుతారేమో చూడాలి.
This post was last modified on January 11, 2025 12:20 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…