Movie News

కంగనా కమిట్మెంట్‌కు సెల్యూట్ కొట్టాల్సిందే..

కంగనా రనౌత్ కొన్ని నెలలుగా సినిమాయేతర విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం బాలీవుడ్ బడా బాబులు చాలామంది మీద ఆమె తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించడం.. అలాగే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనతో కయ్యం పెట్టుకోవడం.. ఈ గొడవల నేపథ్యంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రత కల్పించడం.. ఇలా పలు విషయాలతో ఆమె వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

ఈ మధ్యే ఆమె వీటి నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని మళ్లీ సినిమా షూటింగ్ మీద ఫోకస్ పెట్టింది. ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్న ‘తలైవి’ చిత్రాన్ని ఆమె ఫినిష్ చేసింది. లాక్ డౌన్ ముంగిట ఈ చిత్ర చివరి షెడ్యూల్‌కు బ్రేక్ పడింది. ఎట్టకేలకు మిగిలిన ఆ సన్నివేశాలను కంగనా పూర్తి చేసింది.

‘తలైవి’ సినిమా కోసం కెరీర్లో ఎన్నడూ లేని స్థాయిలో బరువు పెరిగింది కంగనా. ఆ పెరిగిన బరువు ఏకంగా 20 కిలోలట. బాలీవుడ్లో టాప్ స్టార్‌గా ఉన్న కంగనా.. ఓ సౌత్ సినిమా కోసం ఈ స్థాయిలో బరువు పెరగడం అంటే చిన్న విషయం కాదు. మెథడ్ యాక్టింగ్‌ను ఫాలో అయ్యే కంగనా.. పాత్ర కోసం ఎలా కావాలంటే అలా మారిపోతుంటుంది. ‘తలైవి’ కోసం కూడా అలాగే తన అవతారాన్ని మార్చుకుంది.

కొన్ని సన్నివేశాలు మిగిలిపోయాయని.. వేరే కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి అదే లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఆ సినిమా పూర్తి కావడంతో మళ్లీ లుక్ మార్చుకునే పనిలో పడింది. ఎంతో కష్టపడి చూస్తుండగానే బరువు తగ్గిపోయింది. తాజాగా స్లిమ్‌గా మారిన తన లేటెస్ట్ లుక్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ లుక్ చూసి అందరూ షాకవుతున్నారు.

ఇంత తక్కువ సమయంలో కంగనా అంతలా ఎలా బరువు తగ్గి అలాంటి ఫిజిక్‌లోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. బయటి వివాదాల సంగతెలా ఉన్నా సరే.. సినిమాల వరకు అయితే కంగనా టాలెంట్‌ను, ఆమె కమిట్మెంట్‌ను ఎంతమాత్రం తక్కువ చేయలేం.

This post was last modified on October 14, 2020 4:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

46 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago