కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకోవడమంటే మాటలు కాదు. ఒక్కసారిగా వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో యష్ తీసుకున్న జాగ్రత్త వల్ల స్క్రిప్ట్ కోసమే ఎక్కువ సమయం ఖర్చు పెట్టేశాడు. అది కూడా ఊహించని కాంబినేషన్ తో దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ ని ఎంచుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కావాలి. కానీ బోలెడు షూటింగ్ పెండింగ్ ఉండటంతో వాయిదా వేశారు. తాజాగా యష్ పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజరొకటి రిలీజ్ చేశారు.
చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు కానీ చిన్న విజువల్ తో పని కానిచ్చారు. స్టైలిష్ గా కారు దిగి పబ్బులోకి వెళ్లిన యష్ అక్కడో విదేశీ వనితను తీసుకుని ఆమె మీద మద్యం పోస్తూ చిన్న రొమాన్స్ చేయడం తప్ప అందులో ఏం లేదు. నిజానికి ఫ్యాన్స్ ఆశించింది వేరు. పెద్ద బిల్డప్, భారీ ఎలివేషన్ తో అంచనాలు పెంచేలా ఏదైనా గ్లిమ్ప్స్ ఇస్తారని ఎదురు చూశారు. కానీ జరిగింది వేరు. ఒకరకంగా చెప్పాలంటే అధిక శాతం అభిమానులను నిరాశ కలిగించేలా ఉంది. గెటప్, గెడ్డం వగైరాలు కొంచెం కెజిఎఫ్ షేడ్స్ లో ఉన్నా మాఫియా, డ్రగ్స్ నేపథ్యంలో జరిగిన యాక్షన్ డ్రామానే క్లారిటీ అయితే వచ్చింది.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న టాక్సిక్ లో ఇతర క్యాస్టింగ్ కు సంబంధించిన వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గోవా నేపథ్యంలో దశాబ్దాల వెనుక జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా టాక్సిక్ రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేసిన అనుభవం లేని అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇంత పెద్ద స్కేల్ ని ఎలా హ్యాండిల్ చేయబోతోందనేదేది ఆసక్తికరం. కెజిఎఫ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా చేస్తారా లేదానేది చెప్పలేం.
This post was last modified on January 8, 2025 11:41 am
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం…
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…