Movie News

అవి ట్రోల్స్ కాదు.. పొగడ్తలనుకుందట

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘డాకు మహారాజ్’ నుంచి ఇటీవలే రిలీజ్ చేసిన దబిడి దిబిడి పాట విషయమై సోషల్ మీడియాలో విమర్శలు రావడం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ మీద బాగా ట్రోలింగ్ నడిచింది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలయ్య, ఊర్వశి రౌటెలాను కూడా ట్రోల్ చేశారు నెటిజన్లు.

ఐతే బయటి వాళ్లు ట్రోల్ చేయడం ఒకెత్తయితే.. స్వయంగా ఊర్వశి రౌటెలా ఈ పాట మీద వచ్చిన ట్రోల్స్ తాలూకు స్క్రీన్ షాట్లను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె వరుసబెట్టి ఆ పోస్టులు పెట్టడంతో నందమూరి అభిమానులు ఆమెను తిట్టిపోశారు. మిగతా వాళ్లు స్వయంగా ఈ పాటలో డ్యాన్స్ చేసిన ఆర్టిస్టే ట్రోల్స్ షేర్ చేస్తోందంటే సోషల్ మీడియా వేడి ఆమెకు గట్టిగానే తాకిందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఐతే ఊర్వశి తర్వాత ఈ పోస్టులను డెలీట్ చేసింది. ఇదే విషయమై ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగవంశీని విలేకరులు ప్రశ్నిస్తే.. ఆయన చిత్రమైన సమాధానం ఇచ్చాడు. ఊర్వశి షేర్ చేసిన స్క్రీన్ షాట్లు ట్రోల్స్ అని ఆమె అనుకోలేదని.. తనను అందరూ పొగుడుతున్నారు అనుకుని షేర్ చేసిందని నాగవంశీ చెప్పడం విశేషం. దీంతో తాను, దర్శకుడు బాబీ ఆమెకు అసలు విషయం చెప్పి ఆ పోస్టులన్నీ తీయించేసినట్లు తెలిపాడు. కానీ ఇది కవర్ డ్రైవ్‌లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ పాట మీద ట్రోల్స్ వచ్చాయని ఊర్వశికి తెలుసని.. ఆమె కావాలనే ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేసిందని.. టీం ఆమెకేదో సర్దిచెప్పి వాటిని తీయించేసి ఉంటారని అనుకుంటున్నారు. మరీ ట్రోల్స్ ఏవో, పొగడ్తలేవో తెలియనంత అమాయకురాలు ఊర్వశి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on January 8, 2025 10:27 am

Share
Show comments

Recent Posts

తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…

11 minutes ago

ఏపీకి ప్ర‌ధాని ఇచ్చిన వ‌రాల ప్రాజ‌క్టులు ఇవీ..

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు గంటున్న ల‌క్ష్యాల‌ను సాకారం చేసేందుకు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ…

16 minutes ago

ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ డిమాండ్ చూశారా

మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…

2 hours ago

ట్రెండుని పట్టేసుకున్న బెల్లంకొండ ‘హైందవ’

అల్లుడు అదుర్స్ తర్వాత తెలుగులో దర్శనం లేకుండా మాయమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన సమయాన్ని…

3 hours ago

కరోనా రాక ముందు ప్రపంచాన్ని వణికించిన వైరస్ లు ఇవే…

ప్రపంచాన్ని వణికించిన వైరస్‌ల గురించి చెప్పుకోగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కోవిడ్-19 (కరోనా వైరస్). అయితే, కరోనా ముందు కూడా…

3 hours ago

మీనాక్షిని మార్చేసిన ఒక్క ట్రోలింగ్

ఏదో అనుకుంటాం కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ తారల మీద చూపించే ప్రభావం కొన్నిసార్లు మాములుగా ఉండదు. పర్సనల్ గా…

4 hours ago