హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మీద ఇప్పటికే పెద్ద అంచనాలు నెలకొన్నాయి. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో రెండు భాగాలుగా ఇది రానుంది.
దీని తర్వాత టాక్సీ వాలా, శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. క్యాస్టింగ్ తో పాటు సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోంది.
తాజాగా అందిన సమాచారం మేరకు ఈ విడి 14కి సంగీత దర్శకులుగా అజయ్ – అతుల్ లాకయ్యారని సమాచారం. వీళ్ళ ట్రాక్ రికార్డు ఆషామాషీది కాదు. ఎక్కువ మరాఠిలో పని చేసినప్పటికి హిందీలో మంచి ఆల్బమ్స్ చాలా ఉన్నాయి. ప్రభాస్ ఆదిపురుష్ 4 పాటలు కంపోజ్ చేసింది వీళ్ళే.
గతంలో హృతిక్ రోషన్ అగ్నిపథ్, సూపర్ 30, సింగం లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ కి పని చేశారు. తుంబడ్ లో ఒక సాంగ్ ఇచ్చారు. ఇప్పుడు మరాఠిలో ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలతో అంత సులభంగా దొరకలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా సరే విడి 14 ఒప్పుకున్నారంటే కథ ఎగ్జైట్ చేసిందన్న మాట.
దీని స్క్రిప్ట్ కోసమే రాహుల్ సంకృత్యాన్ చాలా సమయం వెచ్చించాడు. ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోవాలన్న ఉద్దేశంతో పక్కాగా వర్క్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ కేటయించనుంది. హైదరాబాద్ తో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నారు.
చరిత్రలో అంతగా పరిచయం లేని ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారట. శ్యామ్ సింగ రాయ్ హిట్టయినా బ్లాక్ బస్టర్ కాలేదనే లోటు రాహుల్ లో ఉంది. ఇటు విజయ్ దేవరకొండ కూడా వరస ఫ్లాపుల నుంచి బయటికి వచ్చేలా కథలు ఎంచుకుంటున్నాడు. చూడాలి టాక్సీవాలా కాంబో ఏం మేజిక్ చేస్తుందో.
This post was last modified on January 7, 2025 5:17 pm
అల్లుడు అదుర్స్ తర్వాత తెలుగులో దర్శనం లేకుండా మాయమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన సమయాన్ని…
ప్రపంచాన్ని వణికించిన వైరస్ల గురించి చెప్పుకోగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కోవిడ్-19 (కరోనా వైరస్). అయితే, కరోనా ముందు కూడా…
ఏదో అనుకుంటాం కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ తారల మీద చూపించే ప్రభావం కొన్నిసార్లు మాములుగా ఉండదు. పర్సనల్ గా…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో గట్టి షాకే తగిలింది. ఏసీబీ విచారణకు…
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని, కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడతామని విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ చెప్పిన…
పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏర్పడే సందిగ్దత, ఆలస్యం మిగిలిన వాటి మీద ప్రభావం చూపించడం చాలాసార్లు చూసిందే.…