సౌత్ ఇండియా అంతటా మంచి ఫాలోయింగ్ ఉన్న, ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లని విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు ఉన్నట్లుండి తమిళ ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. #Shameonvijaysethupathi అంటూ తమిళ జనాలు ట్రెండ్ చేసే పరిస్థితి తలెత్తింది. ఇందుక్కారణం విజయ్ సేతుపతి శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాత్ర చేయబోతుండటమే. నిన్ననే ఈ చిత్ర టైటిల్, అలాగే మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు.
విజయ్ సేతుపతి చొక్కా మీద శ్రీలంక జెండా కనిపించడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వేలాది మంది తమిళుల ప్రాణాలు తీసి, వారి జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన శ్రీలంక దేశ జెండాను విజయ్ తన చొక్కాపై ధరించడం వారికి నచ్చలేదు. అలాగే స్వతహాగా తమిళుడైనప్పటికీ.. ఎప్పుడూ తమిళులపై జరిగిన అకృత్యాలపై నోరు విప్పకుండా, ప్రభుత్వం వైపే నిలిచిన మురళీ బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటించడం కూడా వారికి నచ్చలేదు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, విజయ్ సేతుపతి మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తూ #Shameonvijaysethupathi హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరీ ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటుంఉదని చిత్ర బృందం ఊహించినట్లు లేదు. భారీ బడ్జెట్లో అంతర్జాతీయ సినిమాగా 800ను రూపొందించడానికి సన్నాహాలు చేసుకున్న టీంకు ఇది మింగుడు పడని విషయమే. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ దార్ ఫిలిమ్స్ భయపడిపోయి వెంటనే స్పందించింది.
ఈ సినిమాలో క్రికెటర్‌గా మురళీధరన్ జీవితాన్ని చూపిస్తాం తప్ప.. పొలిటికల్ స్టేట్మెంట్ లాంటిదేమీ ఉండదని, రాజకీయాలతో ఈ సినిమాకు అసలేమాత్రం సంబంధం ఉండనది స్పష్టం చేస్తూ ఒక ఖండన విడుదల చేసింది. అంతే కాదు.. శ్రీలంకలోనే పలువురు తమిళులు ఈ సినిమాలో భాగం అవుతున్నారని, వారి టాలెంట్ ప్రపంచానికి తెలుస్తుందని పేర్కొంది. మరి ఈ వివరణతో తమిళులు ఏమేరకు సంతృప్తి చెంది సినిమా పట్ల వ్యతిరేకతను దాచుకుంటారో చూడాలి.
This post was last modified on October 14, 2020 10:59 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…