గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా ఆవకాశాలు తగ్గిపోయాయని, వాయిదా పడటం ఖాయమని కొన్నివారాలుగా వినిపిస్తున్నా నిర్మాణ సంస్థ నుంచి దాన్ని ఖండిస్తూ ఎలాంటి ప్రకటన రాకపోవడం అభిమానుల్లో అనుమానాలు పెంచింది.
అయితే ఒక్కొకరుగా ఆ డేట్ ని తీసుకోవడం మొదలవ్వడంతో ప్రభాస్ రావడం లేదనే విషయం ఫ్యాన్స్ కి అర్థమైపోయింది. ముందు సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ కోసం లాక్ చేసుకున్నారు. ఆ తర్వాత ధనుష్ ‘ఇడ్లి కడాయ్’ అఫీషియల్ గా ప్రకటించింది. తాజాగా అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ కొద్దీ అదే తేదీని అధికారికంగా తీసుకుంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మార్క్ ఆంటోనీ ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కం కామెడీ ఎంటర్ టైనర్ కు టాలీవుడ్ సంచలనం దేవిశ్రీ ప్రసాద్ పాటలు సమకూర్చాడు. నేపధ్య సంగీతం జివి ప్రకాష్ కుమార్ ఇస్తాడని ఆల్రెడీ టాక్ ఉంది.
తలా ఫ్యాన్స్ లో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. తొలుత సంక్రాంతికి రావాలనుకున్నారు. కానీ అజిత్ మరో చిత్రం విడాముయార్చి వల్ల వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు పొంగల్ కి రెండూ రాకపోవడం వేరే సంగతి. సో చేతిలో ఉన్న మూడు నెలల్లో ప్రమోషన్లను పీక్స్ కు తీసుకెళ్లి గుడ్ బ్యాడ్ అగ్లీ గ్రాండ్ రిలీజ్ ఇవ్వబోతున్నారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఈ లెక్కన విడాముయార్చి ఇప్పట్లో వచ్చే సూచనలు లేనట్టే. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన ఒక పాట పది రోజుల క్రితమే రిలీజయ్యింది. కానీ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ లో వస్తుంది కాబట్టి దానికన్నా ముందు అజిత్ దే మరో సినిమా వచ్చే ఛాన్స్ ఎంతమాత్రం ఉండదు.
ఇప్పటికే పోస్ట్ పోన్లు, వరస డిజాస్టర్లతో కిందా మీద పడుతున్న లైకా సంస్థకు ఈ తాజా పరిణామం షాక్ ఇచ్చేదే. ఏదైతేనేం అటుఇటు తిరిగి ఆరేడు నెలల్లో అజిత్ రెండు సినిమాలు వచ్చేలా ఉన్నాయి. అదే జరిగితే కొత్త రికార్డని చెప్పొచ్చు. భారీ బడ్జెట్ తో రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ అధిక భాగం హైదరాబాద్ లోనే జరిగింది.
This post was last modified on January 6, 2025 5:32 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…