తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వాలు వచ్చాక బెనిఫిట్ షోలకు ఈజీగా అనుమతులు రావడం మొదలైంది. రెండు చోట్లా అర్ధరాత్రి నుంచే షోలు పడిపోతున్నాయి. ‘పుష్ప-2’ సినిమాకైతే ముందు రోజు 9.30 నుంచే షోలు మొదలైపోయాయి. కానీ అలాంటి ఓ షో సందర్భంగానే హైదరాబాద్ సంధ్య థియేటర్లో ఒక విషాదం జరిగింది. దీంతో తెలంగాణలో బెనిఫిట్ షోల విషయమై పీటముడి బిగుసుకుంది.
ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు ఉండవని ప్రభుత్వం తేల్చేసింది. ఐతే కొన్ని రోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలవుతుంది. వాటికి అదనపు షోలు, రేట్లు తెచ్చుకోవాలని నిర్మాతలు చూస్తుండగా.. ఆంధ్రలో ఈజీగా అనుమతులు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు పర్మిషన్లు వచ్చేశాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు కూడా కోరుకుంటే అనుమతులు రావడం లాంఛనమే.
కానీ తెలంగాణలో పరిస్థితి ఏంటన్నదే ఇంకా తేలడం లేదు. మూడు సంక్రాంతి చిత్రాల్లో రెండు నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినవే. మూడోది కూడా ఆయనే నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన అదనపు షోలు, రేట్ల కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. కానీ ఏ సంగతీ క్లారిటీ లేదు. ఒకవేళ అనుమతులు వచ్చినా అర్ధరాత్రి, ముందు రోజు రాత్రి షోలు అయితే ఉండవని తెలుస్తోంది.
తెల్లవారుజామున 4 గంటలు లేదా ఆ తర్వాతే షోలు పడేలా పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అదనపు రేట్లు వస్తే చాలని చూస్తున్న దిల్ రాజు.. అర్ధరాత్రి షోలకు అనుమతులు లేకపోయినా ఇబ్బంది లేదని భావిస్తున్నట్టు సినీ వర్గాల సమాచారం. ఆంధ్రలో మాత్రం గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు అర్ధరాత్రి 1 గంటలకు షోలు కన్ఫమ్ అయినట్లే.
గత ప్రభుత్వ కాలంలో అర్ధరాత్రి, తెల్లవారుజామున షోలు లేక అక్కడి సినీ ప్రియులు ఇబ్బంది పడ్డారు. తెలంగాణలో చాలా ముందుగానే షోలు పడి టాక్ బయటికి వచ్చేసేది. ఆ తర్వాతే ఆంధ్రా జనం సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఆంధ్రలో ఫస్ట్ షో అయ్యేసరికి సీన్ రివర్స్ ఐపోయిందని చెప్పుకోవచ్చు. చూద్దాం తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో.
This post was last modified on January 5, 2025 7:07 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…