అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్ వరస చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. ఒకపక్క బేబీ జాన్ లాంటి కమర్షియల్ సినిమాలు బొక్కా బోర్లా పడుతున్నాయి. ఇంకోవైపు రాజ్ కుమార్ హిరానీ లాంటి కల్ట్ ఫిలిం మేకర్స్ డంకీ లాంటి యావరేజ్ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఆఖరికి టాప్ వన్ సింహాసనాన్ని ఒక డబ్బింగ్ మూవీ పుష్ప 2 ది రూల్ కి ఇవ్వాల్సి వచ్చిందంటేనే టాలీవుడ్ దెబ్బ ఏ రేంజ్ లో పడిందో అర్థం చేసుకోవచ్చు.
కానీ బాలీవుడ్ మేకర్స్ దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. దెయ్యాల ట్రెండ్ నడుస్తోందని వరసగా వాటిని వదిలేందుకు కంకణం కట్టుకున్నారు. గత ఏడాది స్త్రీ 2 కనక వర్షం కురిపించింది. అంచనాలు లేకుండా వచ్చిన ముంజ్యా బ్లాక్ బస్టర్ అయ్యింది. భూల్ భులయ్యా 3 మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా సరే నాలుగు వందల కోట్లు లాగేసింది. అందుకే మాడాక్ బ్యానర్ ఒకటి రెండు కాదు ఏకంగా 8 హారర్ సినిమాలు రాబోయే నాలుగేళ్ల కోసం ముందే ప్రకటించింది. వీటిలో కొన్నింటికి ఏకంగా రిలీజ్ డేట్లు కూడా ఇచ్చేసింది. అంటే అదే పనిగా పిశాచాలు, ఆత్మల కథలు వండుతున్నారన్న మాట.
ఈ సిరీస్ లో మొదటగా వచ్చేది తమ. రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషించింది. దీపావళి విడుదల లాక్ చేసుకుంది. డిసెంబర్ ఆఖరులో శక్తి షాలిని కోసం రిజర్వ్ చేశారు. అలియా భట్ చేయొచ్చు. 2026లో వరుణ్ ధావన్ భేడియా 2 తో చాముండా వస్తుంది. అక్షయ్ కుమార్ ని లీడ్ రోల్ కోసం ప్రయత్నిస్తున్నారు. 2027లో స్త్రీ 3 తో పాటు మహా ముంజ్యా వస్తాయి. క్యాస్టింగ్ కొనసాగుతుంది. 2028లో పెహ్లా మహాయుద్ ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ లో దూసరా మహాయుద్ వస్తాయి. మొత్తం మాడక్ సినిమాటిక్ హారర్ యునివర్స్ లోని క్యారెక్టర్లన్నీ ఈ చివరి సినిమాల్లో కలుసుకుంటాయి. ఆపై ఇంకెన్ని తెస్తారో ఆ దేవుడికే సారీ దెయ్యాలకే తెలియాలి.
This post was last modified on January 3, 2025 8:03 am
సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…
ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…
చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…
బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…
తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…