Movie News

నితిన్ గుస్సా… ఎలా చూసినా న్యాయమే

క్రిస్మస్ రిలీజ్ వదులుకున్నందుకు రాబిన్ హుడ్ విషయంలో నితిన్ బాగా అసహనంతో ఉన్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పెద్ద బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. హీరో డైరెక్టర్ హిట్ కాంబినేషన్ తో పాటు హీరోయిన్ శ్రీలీల లాంటి ఆకర్షణలు మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చేవి. కానీ పుష్ప 2 రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉండటంతో పాటు అల్లు అర్జున్ అనుకోకుండా కేసులో ఇరుక్కుని బెయిలు దాకా వెళ్లడం వల్ల మైత్రి నిర్మాతలకు రాబిన్ హుడ్ మీద ఫోకస్ పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇబ్బంది కన్నా వాయిదా మేలనుకుని డ్రాపయ్యారు.

తీరా చూస్తే రాబిన్ హుడ్ వదులుకున్న డిసెంబర్ 20, 25 తేదీల్లో వచ్చిన కొత్త సినిమాలన్నీయావరేజ్ కంటే కిందే నిలిచిపోవడంతో థియేటర్లు బోసిపోయాయి. పుష్ప 2 వీకెండ్స్ హౌస్ ఫుల్స్ చేయగా సుదీప్ మాక్స్ కు పాజిటివ్ టాక్ వచ్చినా అదేమీ పెద్ద వసూళ్లుగా మారలేదు. మార్కో ఆలస్యంగా జనవరి 1 వచ్చినా సరే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్స్, రివ్యూస్ చూసిన తెలుగు ఆడియన్స్ మొదటి రోజు బాగానే వెళ్లినట్టు స్పష్టమవుతోంది. అంటే బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన వాక్యూమ్ ని ఒక అతి హింసాత్మకంగా ఉన్న మలయాళం డబ్బింగ్ చిత్రం వాడుకుంది కానీ టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ లేకపోయింది.

ఇక్కడ నితిన్ గుస్సాని మరో స్థాయికి తీసుకెళ్లే ఇంకో అంశం ఉంది. శివరాత్రికి ప్లాన్ చేసుకున్న తమ్ముడుని రాబిన్ హుడ్ వల్ల వాయిదా వేయక తప్పదు. మరీ తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులు ఉండటం అంత సేఫ్ గేమ్ కాబోదు. కనీసం మూడు నెలల నిడివి ఉండటం అవసరం. ఇప్పుడు రాబిన్ హుడ్ ఏం చేస్తాడనే దాని మీద తమ్ముడు నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ క్రిస్మస్ కి నితిన్ కనక వచ్చి ఉంటే జనవరి 10 దాకా కనీసం రెండు వారాలకు పైగా స్ట్రాంగ్ రన్ దక్కేది. అదంతా మిస్ అయిపోయింది. అయినా కొన్నిసార్లు పరిస్థితులు ఎవరి చేతుల్లోనూ ఉండనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు.

This post was last modified on January 1, 2025 7:01 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

3 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago