టాలీవుడ్లో చాలా ఓపెన్‌గా, కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడే నిర్మాతగా సూర్యదేవర నాగవంశీకి పేరుంది. ఆయన కామెంట్స్ పలు సందర్భాల్లో చర్చనీయాంశం అయ్యాయి. కొన్నిసార్లు వివాదానికి కూడా దారి తీశాయి. ‘అవతార్-2’ సినిమాను విమర్శించడం మొదలుకుని.. పెద్ద హీరోల సినిమాలకు కథ అవసరం లేదంటూ చేసిన కామెంట్ వరకు పలుమార్లు ఆయన వార్తల్లో నిలిచాడు.
ఇప్పుడు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా బాలీవుడ్‌ను తక్కువ చేసేలా ఆయన చేసిన కామెంట్లు హిందీ సినీ పరిశ్రమ ప్రముఖులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తెలుగు సినీ పరిశ్రమ బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటే.. బాలీవుడ్ బాంద్రా-జుహు మధ్య స్ట్రక్ అయిపోయిందంటూ లెజెండరీ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌తో మాట్లాడుతూ నాగవంశీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
పుష్ప-2 సినిమా ఒకే రోజు 86 కోట్లు కలెక్ట్ చేసిన రోజు బాలీవుడ్‌లో ఎవ్వరూ నిద్ర పోయి ఉండరంటూ నాగవంశీ చేసిన కామెంట్ కూడా దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై కొంచెం లేటుగా బాలీవుడ్ నుంచి ప్రతిఘటన మొదలైంది. బోనీ లాంటి లెజెండరీ, సీనియర్ ప్రొడ్యూసర్‌ను కించపరిచేలా నాగవంశీ మాట్లాడడాన్ని బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
తెలుగు సినిమాలు గత కొన్నేళ్లలో పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్లు అవుతున్నంత మాత్రాన ఇంత అహంకారం పనికి రాదని.. ఘన చరిత్ర ఉన్న హిందీ సినిమాలను తక్కువ చేసి మాట్లాడ్డం తప్పని అక్కడి వాళ్లు మండి పడుతున్నారు. దర్శకుడు సంజయ్ గుప్తా వరుస ట్వీట్లతో నాగవంశీ మీద ఎటాక్ చేయగా.. హన్సల్ మెహతా, సిద్దార్థ్ ఆనంద్ లాంటి పేరున్న డైరెక్టర్లు నాగవంశీ కామెంట్ల మీద సెటైర్లు వేశారు.
బాలీవుడ్ వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు అయితే నాగవంశీ మీద తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతున్నాయి. తన వ్యాఖ్యలతో పాటు బాడీ లాంగ్వేజ్‌ను తప్పుబడుతూ.. బాలీవుడ్ ఘన చరిత్రను గుర్తు చేస్తున్నాయి. ఇలా మిడిసిపడితే కింద పడే రోజులు దగ్గర్లోనే ఉంటాయని కొందరు క్రిటిక్స్ హెచ్చరిస్తున్నారు. ఐతే తెలుగు వాళ్లు మాత్రం ఎన్నో ఏళ్ల పాటు మనల్ని తక్కువగా చూసిన బాలీవుడ్ వాళ్లకు నాగవంశీ గట్టి స్ట్రోకే ఇచ్చాడంటూ కొనియాడుతున్నారు.
This post was last modified on January 1, 2025 4:44 pm
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…