హమ్మయ్యా విడాముయర్చి పోటీ తప్పింది కదాని మెగా ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు కానీ పోటీ రూపంలో ఉన్న సమస్య పూర్తిగా తగ్గలేదన్నది వాస్తవం. అజిత్ తప్పుకోవడం ఆలస్యం ఒక్కసారిగా ఇతర సినిమాలు వరసగా క్యూ కట్టి పండగను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. కోలీవుడ్ కు మనలాగే పొంగల్ సీజన్ చాలా కీలకం. యావరేజ్ అనిపించుకున్నవి సైతం బ్లాక్ బస్టర్ వసూళ్లను తీసుకొస్తాయి. కనీసం రెండు వారాల పాటు థియేటర్లు కిక్కిసిరిపొతాయి. పరవాలేదనే మాట వచ్చినా చాలు ఆడియన్స్ క్యూ కడతారు. అందుకే బంగారం లాంటి ఈ అవకాశాన్ని వాడుకునేందుకు సిద్ధపడుతున్నారు.
అరుణ్ విజయ్ ‘వనంగన్’ కాకుండా మరో అరడజను దాకా సినిమాలు గేమ్ ఛేంజర్ ను కవ్వించేందుకు కాలు దువ్వుతున్నాయని చెన్నై సమాచారం. జయం రవి ‘కాదలిక్కు నేరమిల్లై’కు హీరో ఇమేజ్ తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం లాంటి ఆకర్షణలు బజ్ తీసుకొస్తున్నాయి . బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కొడుకు సిబిరాజ్ ‘టెన్ అవర్స్’ మీద ఓ మోస్తరు అంచనాలున్నాయి. విజయ్ కాంత్ కొడుకు షణ్ముగ పాండియన్ ‘పదవి తలైవన్’కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. షేన్ నిగమ్ ‘మద్రాస్ కారన్’ లో నీహారిక కొణిదెల కూడా ఉంది. లిరికల్ సాంగ్స్ వచ్చాక యూత్ దృష్టి దీని మీద పడింది.
‘తరుణం’ అనే చిన్న సినిమాతో పాటు అయిదేళ్ళు ల్యాబ్ లో ఉన్న ‘సుమో’ని కూడా దించుతున్నారు. ఇవన్నీ బడ్జెట్, కంటెంట్ పరంగా గేమ్ ఛేంజర్ తో సమానం కాదు కానీ థియేటర్ డిస్ట్రిబ్యూషన్ తమిళనాడులో తమిళ సినిమాలకు ఎక్కువ మద్దతుగా ఉంటుంది. చరణ్ మూవీకి దర్శకుడు శంకర్ బ్రాండే కీలకం. ఎస్జె సూర్య కొంతమేర మార్కెట్ పరంగా ఉపయోగపడతాడు. కాకపోతే స్క్రీన్ల సర్దుబాటు విషయంలో దిల్ రాజు దగ్గర హక్కులు కొన్న కోలీ బయ్యర్లకు చిన్నపాటి సవాళ్లు తప్పవు. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే గేమ్ ఛేంజర్ కు ఈ అడ్డంకులన్నీ తొలుగుతాయి. అది తెచ్చుకోవడమే కీలకం.
This post was last modified on January 1, 2025 4:30 pm
మనలో చాలామందికి పొద్దున నిద్రలేచిందే టీ లేక కాఫీ ఏదో ఒకటి తాగకపోతే రోజు ప్రారంభమైనట్లు ఉండదు. అయితే చాలాకాలంగా…
టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్…
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో తన కంబ్యాక్ ఇస్తానని అభిమానులను ఊరిస్తున్న దర్శకుడు శంకర్ దానికి తగ్గట్టే ట్రైలర్ ద్వారా…
కొన్నిసార్లు సినిమాల పరంగా జరిగే సంఘటనలు యాదృచ్చికమే అయినా విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. జనవరి 10 విడుదల…
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు వృత్తి అవకాశాల కోసం ఓపీటీపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారు. హెచ్1బీ వీసాలు పొందేందుకు ఈ…
టాలీవుడ్లో పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారసులకు కూడా లేని అరంగేట్రం బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు దక్కింది. బెల్లంకొండ సురేష్…