గత రెండు సీజన్లలో ఒక కంటెస్టెంట్‍కి పబ్లిక్ ఫుల్ సపోర్ట్ గా నిలబడిపోవడంతో విజేత ఎవరనేది చాలా ముందుగానే తెలిసిపోయింది. ఈసారి అలా జరగకుండా బిగ్‍బాస్ యమ జాగ్రత్త పడుతున్నట్టు అనిపిస్తోంది. అసలే ఐపీఎల్ తాకిడికి ఇబ్బంది పడుతోన్న బిగ్‍బాస్ షో ఇక విజేత ఎవరనేది ముందే తెలిసిపోతే కనుక పూర్తిగా చప్పబడిపోతుంది. అందుకే ఈ సీజన్‍ని తమకు నచ్చిన విధంగా నడిపిస్తోన్న భావన కలుగుతోంది.
ఫలానా కంటెస్టెంట్లు హౌస్‍లో వుండాలి, అదే సమయంలో వాళ్లు స్ట్రాంగ్ అయిపోకుండా చూసుకోవాలి. ఇదే అజెండాతో ఈ సీజన్ నడుస్తోంది. టిక్‍టాకర్ మెహబూబ్ పట్ల మొదట్నుంచీ ఆడియన్స్లో నెగెటివ్ ఫీలింగ్ వచ్చింది. నిజానికి అతను ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయి వుండాలి. విచిత్రంగా స్ట్రాంగ్ అనిపిస్తోన్న దేవి నాగవల్లిని ఎలిమినేట్ చేసేసి టాస్కులలో ‘బండ రాముడి’లా ఆడుతూ మసాలా అందిస్తోన్న మెహబూబ్‍ని కాపాడుకున్నారు.
ఈవారం కనుక మెహబూబ్ నామినేట్ అయితే ఖచ్చితంగా అవుట్ అయిపోయేవాడు. మెహబూబ్‍ని చాలా మంది నామినేట్ చేసారు కూడా. కానీ కెప్టెన్ సోహైల్‍కి ఒక పవర్ ఇచ్చి ఒకరిని కాపాడే శక్తినిచ్చారు. సోహైల్‍కి హౌస్‍లో క్లోజ్ ఫ్రెండ్ మెహబూబ్ కనుక అతడినే సోహైల్ కాపాడతాడని బిగ్‍బాస్‍కి కూడా తెలుసు. కావాలనే ఆ పవర్ సోహైల్‍కి ఇచ్చి మరో రెండు వారాల పాటు మెహబూబ్ లోపల వుండేలా చూసుకున్నారు.
అదే సమయంలో సోహైల్‍కి, అభిజీత్‍కి పెరుగుతోన్న ఫాలోయింగ్‍తో వాళ్లిద్దరూ డిఫెన్స్లో పడేలా వీకెండ్‍లో నాగార్జునతో డోస్ ఇప్పించారు. వారి గేమ్ స్టయిల్ మారితే మరెవరైనా స్ట్రాంగ్ అయి విజేత ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారుతుందనేది బిగ్‍బాస్ గేమ్ ప్లాన్ అయి వుండొచ్చు.
This post was last modified on October 13, 2020 12:20 pm
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్…
పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం…
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు…
‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి…