పెళ్లి చూపులు సినిమాతో అంత పెద్ద హిట్ కొట్టినా కానీ హైద్రాబాదీ అమ్మాయి రీతూ వర్మకి టాలీవుడ్‍లో చెప్పుకోతగ్గ అవకాశాలు రాలేదు. తనను చిత్ర పరిశ్రమ గుర్తించడానికి చాలా సమయం పట్టింది. తమిళంలో దుల్కర్ సల్మాన్‍తో చేసిన ‘కనులు కనులను దోచాయంటే’ రీతూ వర్మలోని కొత్త కోణాన్ని చూపించింది. అదే సమయంలో ఆమెకు తెలుగులోను అవకాశాలు పెరిగాయి.
నానితో టక్ జగదీష్, నాగశౌర్యతో ఒక సినిమా చేస్తోన్న రీతూ వర్మకి ‘కనులు కనులను దోచాయంటే’ సక్సెస్‍తో తమిళం నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. విక్రమ్‍తో ఆమె నటించిన ‘ధృవ నచ్చత్రం’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. పుదమ్ పుదుకాలై అనే తమిళ చిత్రం త్వరలో అమెజాన్ ప్రైమ్‍లో విడుదల కానుంది. చైనా అనే మరో తమిళ చిత్రం నిర్మాణంలో వుంది.
తాజాగా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందే ఒక క్రికెటర్ బయోపిక్ కోసం రీతూ వర్మను సంప్రదించినట్టు తెలిసింది. పెళ్లిచూపులు తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు ఏమంత వర్క్ లేని రీతూ వర్మ ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీ అయిపోయింది. అందుకే అంటారు… సినీ పరిశ్రమలో సక్సెస్ కంటే టైమ్ చాలా ఇంపార్టెంట్ అని.
This post was last modified on October 13, 2020 2:12 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…