సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల ద్వారా రామ్ చరణ్, బాలయ్య ఇద్దరూ చాలా విషయాల్లో సారూప్యత చూపించడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచేలా ఉంది. బజ్ పరంగా రెండూ ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్నాయి. రెండింటికి తమనే సంగీత దర్శకుడు. ఇప్పటిదాకా వచ్చిన పాటలు బాగానే రీచ్ అయ్యాయి కానీ మరీ రికార్డులు బద్దలయ్యే ఛార్ట్ బస్టర్స్ అనిపించుకోలేదు. విజువల్ గా చూశాక అభిప్రాయాలు మారొచ్చేమో చూడాలి. రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యం గురించి ఆల్రెడీ టాక్ ఉంది. అంజలి, శ్రద్ధ శ్రీనాథ్ పాత్రల ట్విస్టులు ఆశ్చర్యపరుస్తాయని అంటున్నారు.
ఇక అసలైన ముచ్చట మరొకటి ఉంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లో ఇటు చరణ్, అటు బాలయ్య కాసేపు పోలీస్ ఆఫీసర్ల గెటప్ లో కనిపిస్తారట. కథ ప్రకారమే ఇలా డిజైన్ చేశారని తెలిసింది. నిడివి ఒకటే ఉండకపోవచ్చు కానీ ఈ పోలిక మాత్రం సమ్ థింగ్ స్పెషలని చెప్పొచ్చు. రెండింటిలోనూ ఇతర బాషల విలన్లు మెయిన్ లీడ్ తీసుకున్నారు. చరణ్ కోసం ఎస్జె సూర్య, బాలయ్య కోసం బాబీ డియోల్ రంగంలోకి దిగారు. హీరోల క్యారెక్టరైజేషన్ పరంగా పోలిక లేదు కానీ అంతర్లీనంగా ఒక బలమైన సందేశమైతే దర్శకులు శంకర్, బాబీ ఇచ్చారని టాక్. మొత్తానికి ఈ కంపారిజన్ల పర్వం బాగుంది కదూ.
అన్నట్టు అన్ స్టాపబుల్ షో కోసం బాలయ్య, చరణ్ ఎపిసోడ్ షూటింగ్ ఈ రోజే జరగనుంది. బోలెడు ఆసక్తికరమైన ముచ్చట్లు ఇందులో చోటు చేసుకోబోతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మీదెంత క్యూట్ ఫ్యామిలీ అని బాలకృష్ణ అనడం లాంటివి బాగా పేలాయి. మరి ఎక్కువగా మాట్లాడని రామ్ చరణ్ తో ఏమేం చెప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ బాక్సాఫీస్ వద్ద పరస్పరం తలపడుతున్న వేళ ఈ కాంబో మరింత స్పెషల్ గా మారనుంది. జనవరి 10 గేమ్ ఛేంజర్ రానుండగా, జనవరి 12 డాకు మహారాజ్ థియేటర్లలో అడుగు పెడతాడు. వీటితో పాటు 14 సంక్రాంతికి వస్తున్నాం ఉంటుంది.
This post was last modified on December 31, 2024 10:24 am
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…