Movie News

విశ్వంభర మౌనం వెనుక అసలు వ్యూహం

ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా స్పష్టత లేని శ్రీకాంత్ ఓదెల సినిమా గురించి మెగా ఫ్యాన్స్ హడావిడి చేశారు కానీ షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న విశ్వంభర గురించి మాత్రం హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని చిరంజీవి సీరియస్ గా తీసుకుని మార్పుల గురించి దర్శక నిర్మాతలతో చర్చించారనే టాక్ నెలల క్రితమే వచ్చింది కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. అనిల్ రావిపూడితో చేయబోయే మూవీ సైతం సౌండ్ చేస్తోంది కానీ విశ్వంభర నుంచి ఏ హడావిడి లేదు. దీని వెనుక వ్యూహాత్మక మౌనం ఉందని మెగా కాంపౌండ్లో వినిపిస్తున్న మాట.

ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని గేమ్ ఛేంజర్ మీద నిలిచేలా చేయాలి. సుదీర్ఘ నిర్మాణం కావడంతో తగ్గిపోయిన బజ్ ని పెంచడం నిర్మాత దిల్ రాజు బృందానికి పెద్ద సవాల్ గా మారింది. అందుకే అమెరికా వెళ్లి మరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకొచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ని గెస్టుగా తీసుకొచ్చి మరో వేడుక చేయబోతున్నారు. ఆ తర్వాత జరిగే నెక్స్ట్ మెగా రిలీజ్ హరిహర వీరమల్లు. దీనికి సైతం గేమ్ ఛేంజర్ సమస్యే ఉంది. ఫ్యాన్స్ ఓజి జపం చేస్తున్నారు కానీ దీన్ని అంతగా పట్టించుకోవడం లేదు. హైప్ పెరగడానికి ఏమేం చేయాలో నిర్మాత ఏఎం రత్నం పక్కా ప్రణాళికతో ఉన్నారట. దీనికి చాలా కసరత్తు అవసరం.

వీటి కోసమే విశ్వంభర హంగామాని ఇంకా మొదలుపెట్టలేదని అంటున్నారు. దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం రీ వర్క్ మీద బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియా స్పందన చూసి అభిమానుల అంచనాల మీద ఒక క్లారిటీ వచ్చింది. వాటిని అందుకోవడం అంత సులభం కాదని అర్థమైపోయింది. బింబిసారలో హీరో కళ్యాణ్ రామ్ కాబట్టి కొన్ని లోపాలు బలమైన కంటెంట్ వల్ల కవరైపోయాయి. కానీ విశ్వంభరకు ఆ ఛాన్స్ లేదు. ప్రతిదాన్ని భూతద్దంలో చూసే యాంటీ ఫ్యాన్స్ తో పాటు కొండంత ఆశలు పెట్టుకున్న అభిమానులను సంతృప్తి పరచాలి. ఏప్రిల్ లేదా మే విడుదలని టార్గెట్ గా పెట్టుకున్నారు కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

This post was last modified on December 31, 2024 9:05 am

Share

Recent Posts

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

28 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

14 hours ago