జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం తారక్ చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఈ ఇద్దరి కలయికలో వచ్చే పాట, ఫైట్లు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద రాని రేంజ్ లో ఉంటాయని బాలీవుడ్ టాక్. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ మేకింగ్ విషయంలో రాజీ పడటం లేదు. దానికి తగ్గట్టే యష్ రాజ్ ఫిలింస్ బడ్జెట్ ని భారీగా ఖర్చు పెడుతోంది. అయితే సినిమాకు సంబంధించి ఒక కీలక లీక్ ఆసక్తికరంగా ఉంది.
దాని ప్రకారం వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడట. ఒకటి దేశభక్తితో శత్రువు ఎంతటి వాడైనా సరే ఊచకోత కోసే ఇండియన్ ఆఫీసర్ కాగా మరొకటి జై లవకుశ తరహాలో పైకి చెడు కనిపించినా లోపల ఎమోషనల్ ఉండే విలన్ టైపు అన్నమాట. మరి ఇది ద్విపాత్రాభినయమా లేక కథకు అనుగుణంగా ఇలా మారుతూ ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా హృతిక్, తారక్ నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడ్డారని టాక్. వచ్చే మార్చి నుంచి ప్రమోషన్ల కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా చేయని బిగ్గెస్ట్ ఈవెంట్స్ ద్వారా వరల్డ్ వైడ్ వివిధ దేశాల్లో ప్రమోట్ చేస్తారట.
దేవర తర్వాత తారక్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగు హక్కుల కోసం అప్పుడే పోటీ ఏర్పడుతోంది. డిస్ట్రిబ్యూషన్ కి నిర్మాత నాగవంశీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ రేంజ్ లో దీనికి మల్టీస్టారర్ క్రేజ్ వస్తుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. వార్ 2లో హృతిక్ కి జోడి కియారా అద్వానీ కాగా జూనియర్ కి ఎవరనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. స్పై యూనివర్స్ లో వార్ 2ని భాగం చేస్తున్నారు. భవిష్యత్తులో వీళిద్దరితో పాటు షారుఖ్, సల్మాన్, టైగర్ శ్రోఫ్, అలియా భట్ ఇలా అందరూ అవెంజర్స్ తరహాలో ఒక గ్రాండ్ మల్టీస్టారర్ చేసినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on December 30, 2024 6:33 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…