చాలా సినిమాల కథలు నిజ జీవిత అనుభవాల నుంచే పుడతాయి. చాలామంది దర్శకులు తమ సొంత కథలకు కమర్షియల్ హంగులు జోడించి చెబుతుంటారు. ‘హృదయ కాలేయం’తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘కొబ్బరి మట్ట’ లాంటి మరో సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన సాయిరాజేష్.. ఇప్పుడు కథ సమకూర్చడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తూ తీసిన ‘కలర్ ఫోటో’కు కూడా ఆయన వ్యక్తిగత అనుభవాలే స్ఫూర్తి అట. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తన కథే అంటున్నాడాయన.
సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా ‘కలర్ ఫోటో’ కథ ఎలా పుట్టిందో సాయిరాజేష్ వివరించాడు. చిన్నతనంలో తాను నల్లగా, అంద విహీనంగా ఉన్నానని చాలా బాధపడేవాడినని.. ఆత్మన్యూనతా భావంతో కుంగిపోయేవాడినని సాయిరాజేష్ తెలిపాడు. యుక్త వయసులోకి వచ్చాక ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని.. రెండేళ్ల పాటు ఆమెను దూరం నుంచి చూస్తూ, ఫాలో అవుతూ గడిపానని.. ఐతే తన రంగు, రూపం బాగోవన్న ఉద్దేశంతో ఆమెకు తన ప్రేమ గురించి చెబితే ‘నో’ అంటుందన్న భయంతో మౌనంగా ఉండిపోయినట్లు తెలిపాడు.
ఐతే వయసు పెరిగాక యండమూరి వీరేంద్రనాథ్ పరిచయం కావడం, ఆయన పుస్తకాలు చదవడం, స్నేహితులు పెరగడంతో తనలో భయాలన్నీ పోయాయని, భౌతిక అందం గురించి ఆలోచించడం మానేసి వ్యక్తిగా ఎదగడం మీద దృష్టిపెట్టానని.. అలా ఒక స్థాయిని అందుకున్నానని.. ఐతే దర్శకుడిగా మారాక తన కథను సినిమాగా తీయాలన్న కోరిక బలంగా కలిగిందని.. ఐతే తన ప్రేమకథను చెప్పడం కన్నా.. నల్లగా ఉండి, ఆత్మవిశ్వాసం లేని హీరో పాత్ర వరకు తన నుంచి తీసుకుని.. మిగతాదంతా కల్పన జోడించి ‘కలర్ ఫోటో’ కథ రాసి, దానికి సుహాస్ సరిపోతాడనిపించి అతణ్ని తీసుకున్నానని సాయిరాజేష్ తెలిపాడు.
తాను ఈ కథకు స్క్రీన్ ప్లే, మాటలు రాయలేకపోయానని ముందు బాధ పడ్డానని.. కానీ తాను పూర్తి స్క్రిప్టు రాసి, ఈ సినిమాను డైరెక్ట్ చేసి ఉంటే రెండేళ్లకు పైగా సమయం పట్టేదని.. సందీప్ చేతికి ఇచ్చి మంచి పని చేశానని, అతను చక్కటి స్క్రీన్ ప్లే, డైలాగులతో ఈ సినిమాను అందంగా మలిచాడని సాయిరాజేష్ వెల్లడించాడు. టీజర్, ఇతర ప్రోమోలతో ఆకట్టుకున్న ‘కలర్ ఫోటో’ ఈ నెల 23న ‘ఆహా’లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 12, 2020 4:06 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…