సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ, డాకు మహారాజ్ లో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్లు అయినా పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం రెండో కథానాయికలుగా నటించిన వాళ్ళకే ఎక్కువ స్కోప్ దక్కిందనే టాక్ ఆశ్చర్యం కలిగించేలా ఉంది ఇది నిజమయ్యేలా ఉంది. ముందు రామ్ చరణ్ సినిమా సంగతి చూద్దాం. అందులో అప్పన్నకు జోడిగా అంజలి నటించింది. ఫ్లాష్ బ్యాక్ లో తన పాత్ర కీలకం. అయితే దర్శకుడు శంకర్ ఈ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెబుతూ ఆమె నటన షాక్ ఇచ్చిందని, సర్ప్రైజింగ్ గా ఉంటూ షాక్ ఇస్తుందని తెగ ఊరించారు. సో ఆషామాషీగా అన్న మాటైతే కాదిది.
ఇక డాకు మహారాజ్ లో శ్రద్ధ శ్రీనాథ్ బాలకృష్ణకు జోడి కాకపోయినా కథ పరంగా దర్శకుడు బాబీ చాలా ప్రాధాన్యం ఇచ్చాడట. చిన్న పాపకు సంబంధించిన సెంటిమెంట్ కూడా ఆవిడతోనే ముడిపడి ఉంటుందని వినికిడి. ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ సినిమా బ్రహ్మాండంగా వచ్చిందని, కావాలంటే లై డిటెక్టర్ పెట్టుకుని చెక్ చేసుకోమని సవాల్ విసరడం చూస్తే చాలా స్పెషలని అర్థమవుతోంది. ఇక్కడ కూడా ఫ్లాష్ బ్యాకే వెన్నెముకగా నిలుస్తుందని అంటున్నారు. సో ఇవి కనక క్లిక్ అయితే అంజలి, శ్రద్ధ శ్రీనాథ్ లకు మంచి బ్రేక్ దొరికినట్టు అవుతుంది. హిట్ అయితే ఆటోమేటిక్ గా ఆఫర్లు పెరుగుతాయని వేరే చెప్పనక్కర్లేదు.
డాకు మహారాజ్ బోనస్ ఏంటంటే ఊర్వశి రౌతేలా ఉండటం. పోలీస్ ఆఫీసర్ గా ఆమెకు లెన్త్ బాగానే ఇచ్చారట. జనవరి పండగ పందెం ఇంకో పదమూడు రోజుల్లో మొదలుకానుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంతో పాటు డబ్బింగ్ మూవీ విడాముయార్చి బరిలో దిగుతున్న నేపథ్యంలో మూవీ లవర్స్ పర్సులు టికెట్లు కొనేందుకు రెడీ అవుతున్నాయి. పుష్ప 2 ది రూల్ తర్వాత ముప్పై అయిదు రోజుల గ్యాప్ తో ముగ్గురు స్టార్ హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసేందుకు సిద్ధం కావడం విశేషం. ఎవరెవరు విజేతలుగా నిలుస్తారో తేల్చేది ప్రేక్షకులు, వసూళ్లే. ఏమవుతుందో చూడాలి.
This post was last modified on December 29, 2024 1:55 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి…
2024.. మరో రెండు రోజుల్లో చరిత్రలో కలిసిపోనుంది. అయితే.. ఈ సంవత్సరం కొందరిని మురిపిస్తే.. మరింత మందికి గుణపాఠం చెప్పింది.…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు జేజేలు కొట్టి.. జ్యోతులు పట్టిన చేతులే.. నేడు కనుమరుగు…
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. ఆయన కుమారుడు, ఆయన కోడలు బ్రాహ్మణి…
2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్…