బాలీవుడ్లో చాలామందితో ప్రేమాయణం నడిపిన హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ సహా ఈ జాబితాలో చాలా పేర్లే ఉన్నాయి. ఐతే ఎంతమందితో డేట్ చేసినా ఇప్పటికీ సల్మాన్ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఐతే తాజాగా సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఒకప్పటి అతడి సహచర నటి ప్రీతి జింటా.. శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టగా.. దానిపై ఓ నెటిజన్ వేసిన ప్రశ్న, దానికి ప్రీతి ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది.
‘‘మీ ఇద్దరూ ఎప్పుడైనా డేట్‌లో ఉన్నారా’’ అని ప్రీతిని ఒక నెటిజన్ అడిగాడు. దీనికామె ‘నో’ అని బదులిస్తూ.. సల్మాన్ తన కుటుంబ సభ్యుడితో సమానమని చెప్పింది. ‘‘మేమిద్దరం ఎప్పుడూ డేటింగ్ చేయలేదు. తను నా కుటుంబ సభ్యుడితో సమానం. అలాగే నా భర్తకూ సల్మాన్ మంచి స్నేహితుడు. నా సమాధానంతో మీరు ఆశ్చర్యపోతే నన్ను క్షమించండి’’ అని ప్రీతి పేర్కొంది. పెళ్లయిన నటిని ఇలా ప్రశ్నించిన వ్యక్తి మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు.
ప్రీతి.. 2016లో జీన్ గుడ్ఎనఫ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రీతి ఫిలిం సెలబ్రెటీలు ఎవ్వరితోనూ ప్రేమలో ఉన్నట్లు ఎప్పుడూ వార్తలు రాలేదు. కానీ తన వ్యాపార భాగస్వామి అయిన నెస్ వాడియాతో కొంత కాలం డేట్ చేసినట్లు గుసగుసలు వినిపించాయి. కానీ తర్వాత వీరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి.
అతడిపై ఆమె కేసు పెట్టే వరకు వెళ్లింది వ్యవహారం. తర్వాత ఆ గొడవ సమసిపోయింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమానులుగా కొనసాగుతున్నారు. 2018లో వచ్చిన ‘భయ్యాజీ సూపర్ హిట్’ తర్వాత ప్రీతి సినిమాల్లో నటించలేదు. ఆమె ‘లాహోర్ 1947’ మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతోంది.
This post was last modified on December 28, 2024 6:42 pm
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
రాష్ట్రంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను మాత్రమే భర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీఎం విచక్షణ…
"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయన మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నా" ఓ 15 ఏళ్ల కిందట కర్ణాటకలో జరిగిన రాజకీయం…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…