సంక్రాంతి వస్తున్న సినిమాలు మూడు పెద్ద హీరోలవే. వాటిలో రెండింటికి సంగీత దర్శకుడు తమనే. అయితే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ నుంచి ఇప్పటిదాకా విడుదలైన పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఆహా ఓహో అంటూ ఎక్కడ చూసినా అవే వినిపించే స్థాయిలో రీచ్ ఇంకా తెచ్చుకోలేదు. రివర్స్ లో సంక్రాంతికి వస్తున్నాంకు భీమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ దూసుకెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా గోదారి గట్టు మీద 50 మిలియన్లు దాటేసి టాప్ ఛార్ట్ బస్టర్ అయ్యింది. ఇది ఒకరకంగా తమన్ కు షాకే. ఎందుకంటే బడ్జెట్ పరంగా పెద్దవైన బాలయ్య, చరణ్ కంటే వెంకీ మూవీకి హైప్ పెరగడం.
ఇప్పుడు తమన్ ముందు పలు సవాళ్లున్నాయి. మొదటిది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కంటెంట్ నిలబెట్టడం. దర్శకుడు శంకర్ ఎలా రాబట్టుకుంటాడో కానీ ఆయన గతంలో ఏఆర్ రెహమాన్ తో చేయించుకున్న నేపధ్య సంగీతం ఆయా సినిమాలకు ప్రాణంగా నిలిచింది. వాటికి ధీటుగా గేమ్ ఛేంజర్ కోసం తమన్ ఎలా కంపోజ్ చేశాడనేది కీలకం. ఇక డాకు మహారాజ్ గురించి నాగవంశీ, బాబీ ఇస్తున్న హైప్ మాములుగా లేదు. ఇంటర్వెల్ కు ఇరవై నిమిషాల ముందు నుంచి పేపర్లు విసురుతూనే ఉంటారని తెగ ఊరిస్తున్నారు. ఇవి నిలబడాలంటే తమన్ స్కోర్ కీలకం. అఖండ, వీరసింహారెడ్డి బీజీఎమ్ ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరెట్.
అటుపక్కేమో ఎలాంటి హడావిడి లేకుండా భీమ్స్ తనకొచ్చిన స్టార్ ఛాన్స్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నాడు. తొలి బ్రేక్ ధమాకాతోనే వచ్చినప్పటికీ ఆ తర్వాత గ్యాప్ వచ్చేసింది. సో 2025లో సంక్రాంతి వస్తున్నాం, మాస్ జాతరతో రెండు బ్లాక్ బస్టర్స్ పడ్డాయంటే టాప్ లీగ్ లోకి చేరిపోవచ్చు. అతని టార్గెట్ ఇదే. ఒకవేళ మ్యూజికల్ గా వెంకటేష్ సినిమా టాప్ లో నిలబడితే తమన్ మీద కామెంట్స్ వస్తాయి. సో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ కు బెస్ట్ ఇవ్వాల్సిందే. హైప్ పరంగా మూడు సినిమాలు ఇంచుమించు ఒకే పడవలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. పుష్ప 2 హ్యాంగోవర్ చివరికి వచ్చేసింది కాబట్టి ఇక వీటి ప్రమోషన్లు ఊపందుకోవాలి.
This post was last modified on December 28, 2024 12:11 pm
ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో…
బాలీవుడ్లో చాలామందితో ప్రేమాయణం నడిపిన హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ సహా ఈ జాబితాలో…
‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత ఆ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నాడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట…
‘పుష్ప...పుష్ప..పుష్ప..పుష్ప..పుష్ప రాజ్...’ అంటూ డిసెంబరు 4వ తేదీ నుంచి దేశమంతా ‘పుష్ప’ ఫీవర్ వైల్డ్ ఫైర్ లా వ్యాపించింది. సామాన్యుల…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్కు 'ఫార్ములా ఈ - రేస్' ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును ఇప్పటికే…