ఏడు నెలల విరామం తర్వాత థియేటర్లు తెరుచుకుంటున్నాయన్న మాటే కానీ.. కొత్త సినిమాల విడుదల కష్టంగానే ఉంది. ఇంకో మూడు రోజుల్లో థియేటర్లు పున:ప్రారంభం కాబోతుండగా.. ఒక్క పేరున్న సినిమా కూడా రిలీజ్ రేసులోకి రాలేదు. మామూలుగా అయితే సినిమాలకు మంచి డిమాండ్ ఉండే దసరా సీజన్ ఈసారి వెలవెలబోనుందని స్పష్టమవుతోంది.
కనీసం వచ్చే నెలలో దీపావళికి అయినా పరిస్థితులు బాగు పడి కొత్త, పెద్ద సినిమాలు రిలీజవుతాయన్న సంకేతాలు కనిపించడం లేదు. ఆ సీజన్ మీద కూడా సినీ పరిశ్రమ ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆశలన్నీ తర్వాత వచ్చే క్రిస్మస్ సీజన్ మీదే. ఈ ఆశతోనే బాలీవుడ్లో ఒక పేరున్న సినిమాను ఆ సీజన్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రమే.. 83.
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం, ఆయన నేతృత్వంలో భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలవడం.. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మామూలు పరిస్థితుల్లో అయితే మేలోనే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. మధ్యలో దీని ఓటీటీ రిలీజ్ గురించి వార్తలొచ్చాయి కానీ.. చిత్ర బృందం ఆ ప్రచారాన్ని ఖండించింది. ఎప్పటికైనా థియేటర్లలోనే తమ చిత్రం విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఆ మాటకు కట్టుబడి క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అప్పటికి థియేటర్లు 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో మామూలుగా నడుస్తాయని, జనాలు కూడా బాగానే థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నారు. దీంతో పాటే థియేట్రికల్ రిలీజ్ కోసం చూస్తున్న మరో భారీ చిత్రం ‘సూర్యవంశీ’ని రిపబ్లిక్ డే కానుకగా వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయబోతున్నట్లు కూడా నిర్మాతలు ప్రకటించారు. మరి ఈ చిత్రాలు అనుకున్న ప్రకారమే విడుదలవుతాయని ఆశిద్దాం.
This post was last modified on October 12, 2020 3:30 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…