ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో యష్ కి జోడిగా చేసిన శ్రీనిధి శెట్టి కొంత కాలం ఖాళీగా ఉండాల్సి వచ్చింది. విక్రమ్ కోబ్రాలో మెరిసినా దాని ఫలితం నిరాశ కలిగించడంతో ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. 2018 నుంచి 2022 దాకా కేవలం మూడు సినిమాల్లో నటించిందంటే ఆశ్చర్యం కలిగించినా అదే వాస్తవం. క్రమంగా ఇప్పుడు దశ మారుతున్నట్టు కనిపిస్తోంది. ముందు సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదాలో ఛాన్స్ కొట్టేసింది. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ రామ్ కామ్ లో రాశిఖన్నా మరో హీరోయిన్.
న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో శ్రినిథి శెట్టినే మెయిన్ లీడ్. హిట్ ఫ్రాంచైజ్ లో అత్యధిక బడ్జెట్ తో దర్శకుడు శైలేష్ కొలను క్రేజీ లొకేషన్లలో చిత్రీకరణ జరపడం ఆసక్తి రేపుతోంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 అవకాశం వచ్చినట్టు చెన్నై టాక్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోయే ఈ సూపర్ హిట్ సీక్వెల్ కి స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. మొన్న 12న రజని పుట్టినరోజు అనౌన్స్ చేద్దామనుకున్నారు కానీ కూలి టీజర్ వల్ల ఆగిపోయారు. నూతన సంవత్సరం లేదా సంక్రాంతి పండక్కు అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్ న్యూస్. జైలర్ 2 మీద మాములు హైప్ లేదు.
కేవలం ఒక పాటకే పరిమితమయిన తమన్నాని జైలర్ 2లో ఫుల్ లెన్త్ రోల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కొడుకు చనిపోయాక రజని పాత్ర మనవడు, కోడలు, భార్యతో మిగిలిపోతుంది. ఇక్కడి నుంచి ముత్తువేల్ పాండియన్ జీవితంలో కొత్త విలన్ ప్రవేశిస్తాడు. ఈసారి విగ్రహాల దొంగతనం కాకుండా వేరే కొత్త పాయింట్ తీసుకున్నట్టు సమాచారం. ఇది ఓకే అయితే శ్రీనిధి శెట్టి జాక్ పాట్ కొట్టినట్టే. ఎందుకంటే జైలర్ 2లో మరో స్టార్ హీరో ఉన్నాడు. ధనుష్ పేరు వినిపిస్తోంది కానీ ఇంకా ఖరారు కాలేదు. ఆ స్థానంలో వేరొకరు వచ్చినా సరే అతనికి జోడిగా శ్రీనిధి శెట్టి కనిపించనుంది. జైలర్ 2కి సంగీతం ఆనీరుధే.
This post was last modified on December 27, 2024 6:31 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట…
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…