ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకులు భావిస్తే వాటిని ఓటిటి లేదా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ ముచ్చట తీర్చుకుంటారు. కానీ అదే పనిగా ఆడియన్స్ డిమాండ్ చేసే సందర్భాలు తక్కువగా ఉంటాయి. సత్యం సుందరం అలాంటి అరుదైన కోవలోకి వస్తోంది. విడుదలైన టైంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కమర్షియల్ గా అద్భుతాలు చేయలేదు. తెలుగు తమిళం నయం కానీ ఇతర భాషల్లో డిజాస్టర్ అనిపించుకుంది. తర్వాత నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది.
ట్విస్ట్ ఏంటంటే సత్యం సుందరంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ కట్ చేసిన 18 నిమిషాలను తర్వాత జోడించమని చాలా మంది ఒత్తిడి చేశారు. కనీసం మూడో వారం నుంచైనా పెట్టొచ్చు కదాని ఫోన్లు, మెసేజ్ లు చేశారు. ఓటిటిలో వచ్చాక ఇంత మంచి చిత్రం మిస్ అయినందుకు బాధ పడుతున్నామని, గూగుల్ పేలో డబ్బులు వేసి నిర్మాతకు పంపమని అడిగారు. దీంతో షాక్ తినడం ప్రేమ్ కుమార్ వంతయ్యింది. అదేదో వాళ్ళందరూ థియేటర్లకు వచ్చి చూసి ఉంటే కమర్షియల్ గానూ సత్యం సుందరం స్కేల్ పెరిగేది కదా. డిజిటల్ లో చూశాక ఆహా ఓహో అంటే లాభం ఏముంటుంది. ఇదంతా ఒక ఇంటర్వ్యూలో ఆయనే పంచుకున్నారు.
దీని సంగతలా ఉంచితే ప్రేమ్ కుమార్ కు చాలా పేరు తీసుకొచ్చిన 96 సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ అవుతోంది. ముప్పాతిక భాగం పూర్తి చేశారు. విజయ్ సేతుపతి, త్రిషలే కొనసాగుతారా లేక ఇంకో కొత్త జంటను తీసుకుంటారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇదే 96ని తెలుగులో శర్వానంద్, సమంతలతో జానుగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ్ కుమారే దర్శకత్వం వహించారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. భావోద్వేగాలను అద్భుతంగా చూపిస్తారనే పేరున్న ఈ విలక్షణ దర్శకుడు 96 టూలో ఏం చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి రీమేక్ కాకుండా డబ్బింగ్ మాత్రమే వస్తుందేమో.
This post was last modified on December 26, 2024 2:49 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…