‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ తిన్నప్పటికీ.. ‘జై లవకుశ’తో పుంజుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో చేసిన ‘డాకు మహారాజ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
గతంలో తాను తీసిన ఒక సినిమా విషయంలో ప్రొడక్షన్ హౌస్ వల్ల ఇబ్బందులు పడ్డానని అతను వ్యాఖ్యానించాడు. ఆ సినిమా పేరు చెప్పడానికి ఇష్టపడని బాబీ.. అది హిట్ అయినప్పటికీ, ఇంకా పెద్ద రేంజికి వెళ్లాల్సిన సినిమా అని చెప్పాడు. తాను కోరుకున్న బడ్జెట్ ఇచ్చి, ఇంకా గ్రాండ్‌గా సినిమా తీసి ఉంటే దాని రేంజే వేరుగా ఉండేదని అతను అభిప్రాయపడ్డాడు. ఇంతకీ బాబీ ఏ సినిమా గురించి అలా మాట్లాడాడు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
ఐతే ఇందుకోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కనిపించడం లేదు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే.. ఆ సినిమా ‘జై లవకుశ’ అని తేల్చేస్తున్నారు. తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సంస్థ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ గురించే బాబీ మాట్లాడాడని అంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మధ్య నందమూరి అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ సంస్థ నుంచి వచ్చిన ‘దేవర’ నిర్మాణ విలువల విషయంలో విమర్శలు వచ్చాయి. కళ్యాణ్ రామ్ ఏమో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో పోల్చాడీ సినిమాను.
కానీ సినిమాలో ఆ స్థాయి క్వాలిటీ కనిపించలేదు. విజువల్ ఎఫెక్ట్స్ అంచనాలకు తగ్గట్లు లేవంటూ తారక్ ఫ్యాన్సే తిట్టిపోశారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ టైంలో, ఆ తర్వాత ఓటీటీలో వచ్చినపుడు ఈ విషయమై ట్రోల్స్ కూడా బాగానే వచ్చాయి. ‘జై లవకుశ’ విషయంలో బాబీ బాధ పడడంలో తప్పేమీ లేదని.. ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్లు ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడడం మామూలే అని.. ఇక నుంచైనా సినిమాలు తీసినపుడు గ్రాండ్‌గా, మంచి క్వాలిటీతో తీయడం మంచిదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on December 25, 2024 7:45 pm
కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…