నవీన్ పొలిశెట్టిని స్క్రీన్ మీద చూసి ఏడాది దాటిపోయింది. తన చివరి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ గత ఏడాది అక్టోబరు తొలి వారంలో విడుదలైంది. సూపర్ హిట్ అయిన ఆ సినిమా తర్వాత నవీన్ ఇప్పటిదాకా కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. మధ్యలో యాక్సిడెంట్ వల్ల అతను చాన్నాళ్లు ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ మధ్యే మళ్లీ ఫిట్‌గా తయారై బాలయ్య షో ‘అన్‌స్టాపబుల్’లో సందడి చేశాడు. ఇక తన నుంచి కొత్త సినిమా ప్రకటన వస్తుందని చూస్తుండగా.. ఈ రోజు పెద్ద షాకిచ్చాడు.
ఎప్పుడో 2022 ఆరంభంలో అనౌన్స్ చేసిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని కొత్త చిత్రంగా ప్రకటించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కొత్త టీజర్ వదిలింది టీం. ప్రి వెడ్డింగ్ టీజర్ పేరుతో రిలీజ్ చేసిన ప్రోమో ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. రేపట్నుంచి పెళ్లి సందడి మొదలు అని ఇందులో పేర్కొన్నారు. ఐతే ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రి వెడ్డింగ్ టీజర్లో ఎక్కడా దర్శకుడి పేరు కనిపించలేదు. హీరో, నిర్మాతల పేర్లు మాత్రమే ఉన్నాయి.
ఈ చిత్రాన్ని మొదలుపెట్టింది ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో. ఇదే తన తొలి చిత్రం కావాల్సింది. కానీ స్క్రిప్టు అనుకున్నంత బాగా రాకపోవడంతో ఈ సినిమాను మధ్యలో ఆపేశారని వార్తలు వచ్చాయి. రెండేళ్లకు పైగా ఈ సినిమా వార్తల్లో లేదు. దీన్ని పక్కన పెట్టే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చేశాడు నవీన్. ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకున్నాక ఇంకేదో కొత్తది, పెద్ద సినిమాను నవీన్ లైన్లో పెడతాడని అనుకున్నారు. కానీ అతను తిరిగి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్తున్నాడు. ఇలా పక్కన పెట్టిన సినిమాను మళ్లీ లైన్లో పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకరే రూపొందించబోతున్నాడా.. తెరపైకి కొత్త దర్శకుడు రాబోతున్నాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on December 25, 2024 5:44 pm
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…