సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు చెల్లిస్తున్న అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి పుష్ప టీం తరఫున రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నామని అల్లు అరవింద్ తెలిపారు.
ఆ రూ.2 కోట్లలో రూ. కోటి రూపాయలు అల్లు అర్జున్, రూ.50 లక్షలు దర్శకుడు సుకుమార్, రూ.50 లక్షలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే రూ.2 కోట్ల చెక్ ను టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుకు అందజేశారు. సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్, దిల్ రాజులతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను అల్లు అరవింద్ ఈ రోజు పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. శ్రీ తేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని వైద్యులు సానుకూలంగా చెప్పారని అన్నారు.
శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, త్వరలోనే మన అందరితో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నానని తెలిపారు. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఈ క్రమంలోనే శ్రీ తేజ్ భవిష్యత్తు కోసం పుష్ప టీం తరఫు నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేశామని చెప్పారు.
This post was last modified on December 25, 2024 3:36 pm
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మంచు ఫ్యామిలీ గొడవ.. మరోవైపు సంధ్య…
ఉపేంద్ర యుఐ కోసం అయిదు రోజులు ఆగి విడుదలవుతున్న సినిమా మ్యాక్స్. ఈగతో మనకు విలన్ గా పరిచయమై బాహుబలి,…
తండ్రి ఒకప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్, మరోవైపు అన్న మినిమమ్ హిట్స్ అందుకుంటున్నాడు. కానీ తమ్ముడు మాత్రం ఒకప్పుడు…
కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్…
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…