మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్ గా పలకరిస్తూనే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చేశాక ఇప్పటి జెనరేషన్ తో కనెక్టివిటీ వచ్చింది. అంతకు ముందు మనమంతాలో లీడ్ రోల్ చేసినా అదేమంత ఆశించిన ఫలితం అందుకోలేదు. తాజాగా ఆయన దర్శకుడిగా మారి చేసిన మొదటి ప్యాన్ ఇండియా ప్రయత్నం బరోజ్ ఇవాళ థియేటర్లలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. నిన్న ప్రీ రిలీజ్ మీట్ జరిగింది.
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ టాలీవుడ్ ఇప్పుడు అతి పెద్ద పరిశ్రమగా ఎదిగిందని, ఇక్కడి ప్రేక్షకులు సినిమాను చాలా గౌరవిస్తారని, ఎన్నో అద్భుతమైన హిట్లు ఇస్తున్నారని ఇటీవలే పుష్ప 2తో అది మరోసారి రుజువయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. జనతా గ్యారేజ్ లో నటించడం వల్ల మైత్రి వాళ్ళు బరోజ్ తీసుకోలేదని, ట్రైలర్ లో కంటెంట్ నచ్చాకే ముందుకొచ్చారని క్లారిటీ ఇచ్చారు. ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్ తో పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రజనీకాంత్ చిరంజీవి లాంటి స్టార్లలో స్నేహం కొనసాగిస్తూ ఈ తరంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని లాల్ చెప్పారు.
This post was last modified on December 25, 2024 11:52 am
మాస్ రాజా రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. కరోనా కాలంలో వచ్చిన క్రాక్ మూవీనే రవితేజకు…
రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…