Movie News

డేంజర్ గేమ్ పార్ట్-2.. ఉత్కంఠకు సిద్ధమా?

అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల కిందట సంచలనం రేపింది. ఈ పేరు వింటే ఓటీటీ ప్రేక్షకుల్లో ఒక రకమైన అలజడి కలుగుతుంది. అంత ఉత్కంఠభరితంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా.. ఉర్రూతలూగిస్తూ సాగింది ఆ సిరీస్. వెబ్ సిరీస్‌ల చరిత్రలోనే అత్యంత ఆదరణ పొంది.. ఓటీటీల్లో వ్యూస్ పరంగా అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసిన ఘనత ఈ సిరీస్ సొంతం.

అంతర్జాతీయ స్థాయిలో టాప్ క్వాలిటీ సినిమాలు, సిరీస్‌లకు పెట్టింది పేరైన కొరియా నుంచి వచ్చిన ‘స్క్విడ్ గేమ్’ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ తీవ్ర ఉత్కంఠకు, ఉద్వేగానికి గురి చేసేదే. హ్వాంగ్ డాంగ్ హ్యూక్ రూపొందించిన ఈ సిరీస్ చిన్న పిల్లలను సైతం విపరీతంగా ఆకట్టుకుని.. దాని మీద ఎన్నో గేమ్స్ రావడానికి కూడా దోహదం చేసింది. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ఇంకో రెండు రోజుల్లో తెరపడనుంది.

స్క్విడ్ గేమ్-2 ఈ నెల 26 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో చాలా టైం తీసుకుని రెండో సీజన్‌ను తీర్చిదిద్దాడు హ్వాంగ్ డాంగ్ హ్యూక్. తొలి సీజన్ మాదిరే ఇది కూడా తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగుతుందని అంటున్నారు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా సాగింది. ‘స్క్విడ్ గేమ్’ కాన్సెప్ట్ చాలా షాకింగ్‌గా ఉంటుంది.

మల్టీ మిలియనీర్లయిన కొంతమంది.. జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటూ, అప్పుల పాలై డబ్బు కోసం వెంపర్లాడుతున్న వ్యక్తులను ఎంచుకుని ఒక దీవిలోకి తీసుకొచ్చి వాళ్లతో డేంజరస్ గేమ్స్ ఆడిస్తారు. ఈ క్రమంలో తప్పులు చేసిన వాళ్లు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ డేంజరస్ గేమ్స్ చూసి ఆ మల్టీ మిలియనీర్లు వినోదం పొందుతుంటారు. ఆ గేమ్స్ సాగే వైనం.. తీవ్ర ఉత్కంఠతో ఉంటుంది. ఒక ఎపిసోడ్ మొదలుపెడితే.. అన్నీ చూసేదాకా వదల్లేని థ్రిల్, టెన్షన్ ఉంటుంది ఈ సిరీస్‌లో.

“స్క్విడ్ గేమ్” దర్శకుడు మరియు రచయిత హ్వాంగ్ డాంగ్-హ్యుక్, AFPకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో,

సిరీస్ ప్రధాన పాత్ర సియోంగ్ గీ-హన్ పాత్రకు 2009లో జరిగిన కార్మిక సమ్మెలు ఎలా ప్రేరణగా మారాయో తెలిపాడు దర్శకుడు. ఆ కాలం చాలా కష్టసమయం, ఒక కంపెనీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ, దాదాపు 2,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ పరిస్థితి ఆ కుటుంబాలపై చాలా తీవ్ర ప్రభావం చూపించింది, ఈ సంఘటనలే ఆ పాత్ర రూపకల్పనకు ఆవశ్యకమైన భావోద్వేగాలను అందించాయని దర్శకుడు తెలిపాడు.

తొలి సీజన్‌ను ఎలాంటి అంచనాలు లేకుండా చూసి.. అందులో కాన్సెప్ట్‌కు థ్రిల్లయిపోయారు ప్రేక్షకులు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో తెలుసు కాబట్టి.. ఈసారి వారిని థ్రిల్ చేయడం సవాలే. ఈ నేపథ్యంలో ‘స్క్విడ్ గేమ్-2’ అంచనాలను ఎలా అందుకుంటుందో చూడాలి.

This post was last modified on December 24, 2024 7:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

11 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

45 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

7 hours ago