న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో దసరా తర్వాత మరో వంద కోట్ల గ్రాసర్ గా నిలిచిన సరిపోదా శనివారం ఎంత పెద్ద హిట్టో మళ్ళీ చెప్పనక్కర్లేదు. హాయ్ నాన్న లాంటి క్లాస్ మూవీ తర్వాత మళ్ళీ మాస్ ని టార్గెట్ చేసుకుని నాని సాధించిన విజయం అభిమానులకు మాములు కిక్ ఇవ్వలేదు. దీన్ని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలీవుడ్ రిపోర్ట్. కార్తీక్ ఆర్యన్ హీరోగా సాటర్డే స్టార్ టైటిల్ తో రూపొందిస్తారని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ డివివి దగ్గర హక్కులకు సంబంధించిన వ్యవహారం నడుస్తోందట. అయితే ఇది అవసరమాని అడిగేందుకు లాజిక్ ఉంది.
సరిపోదా శనివారం ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో హిందీ డబ్బింగ్ వెర్షన్ తో సహా అందుబాటులో ఉంది. కొన్ని కోట్ల మంది చూసేశారు. తిరిగి అదే కథని మళ్ళీ చూపిస్తే ఎలా అనేది విశ్లేషకుల కామెంట్. గతంలో కార్తీక్ ఆర్యన్ ఇదే తరహాలో ఎంతో ముచ్చట పడి అల వైకుంఠపురములో రీమేక్ చేశాడు. అది దారుణంగా డిజాస్టరయ్యింది. కనీసం ఏవరేజ్ కూడా కాలేదు. అంతకు ముందు షాహిద్ కపూర్ జెర్సీ, రాజ్ కుమార్ రావు హిట్ 1 ది ఫస్ట్ కేస్ లాంటివి ఊసులో లేనంతగా పోయాయి. వీటిలో కొన్ని ఒరిజినల్ వెర్షన్ హ్యాండిల్ చేసిన తెలుగు దర్శకులే తీసినప్పటికి నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయారు.
మరి నాని మూవీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. భూల్ భూలయ్యా 3తో ఇటీవలే మంచి విజయం సాధించిన కార్తీక్ ఆర్యన్ రీమేకులు కూడా స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువగా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయినా తెలుగు తమిళ హిట్లని రీమేక్ చేయడం కంటే ఇక్కడి దర్శకులతో ప్యాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేయడం ఎక్కువ లాభదాయకమని హిందీ స్టార్లు గుర్తించాల్సిన విషయం. షారుఖ్ ఖాన్ అలా చేసే జవాన్ రూపంలో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అయినా రీమేకులతో షాక్ మీద షాక్ తింటున్న అక్షయ్ కుమార్ ని ఉదాహరణగా తీసుకుంటే ఏ సమస్యా ఉండదు.
This post was last modified on December 24, 2024 7:03 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…