సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరెస్టయి మధ్యంతర బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ ఈ రోజు పోలీసుల విచారణకు హాజరయ్యారు. సెంట్రల్ జోన్ డీసీపీ, ఏసీపీ, సీఐల నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం విచారణ జరిపింది. దాదాపు 3 గంటల పాటు తర్వాత అల్లు అర్జున్ విచారణ ముగిసింది.
విచారణ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. మీడియాతో పాటు ఎవరితో మాట్లాడకుండా అల్లు అర్జున్ తన కారులో ఎక్కి నేరుగా ఇంటికి వెళ్లి పోయారు. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ ఉన్నారు. విచారణ సందర్భంగా దాదాపుగా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానమిచ్చారని తెలుస్తోంది. కేసు విచారణలో ఉండగా బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కూడా పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది.
కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ వీటి మీద పోలీసు అధికారులు స్పష్టత ఇవ్వాలి. ఈ కేసులో అల్లు అర్జున్ బౌన్సర్ల ఆర్గనైజర్ ఆంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాటకు ఆంటోనీ ప్రథమ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్, ఆంటోనీలను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేయాలని తొలుత పోలీసులు భావించారని తెలుస్తోంది.
అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో థియేటర్ దగ్గరకు బన్నీ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకునే అవకాశముందని, మరోసారి తొక్కిసలాట జరిగే అవకాశమున్న నేపథ్యంలో మరో రోజుకు ఆ ఎపిసోడ్ ను పోలీసులు వాయిదా వేశారని తెలుస్తోంది. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. అల్లు అర్జున్ ఇంటి కాంపౌండ్ వాల్ కు తెల్లటి పరదాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఓయూ జేఏసీ రాళ్ల దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on December 24, 2024 3:40 pm
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…