దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేస్తున్నా.. ముందే కథ గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చేస్తాడు. ఈగ లాంటి కొన్ని సినిమాలకు ముందే కథ చెప్పి సినిమా మొదలుపెట్టిన ఘనుడు జక్కన్న. తన కొత్త సినిమా ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ప్రేక్షకులకు చాలా ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా చిత్రీకరణ ఆరంభ దశలో దశలో ఉండగా.. ఎన్టీఆర్, చరణ్‌ల పాత్రల గురించి క్లియర్ కట్‌గా చెప్పేశాడు జక్కన్న.
ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్ర చేస్తుంటే.. చరణ్ సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. వాస్తవంగా వీళ్లిద్దరూ జీవించిన కాలాలు వేరు. వాళ్లెప్పుడూ కలవలేదు కూడా. కానీ వాళ్లు కలిసినట్లు.. అలా కలిశాకే వారి జీవితాలు మారినట్లు ఒక కల్పిత కథను చెప్పనున్నట్లు రాజమౌళి స్పష్టత ఇచ్చాడు.సినిమాలో పెద్దగా దేశభక్తి కోణం ఉండదని, ఇది ఫక్తు కమర్షియల్ కోణంలో సాగుతుందని కూడా జక్కన్న క్లారిటీ ఇచ్చాడు.
ఐతే జక్కన్న అంత క్లియర్‌గా చెప్పినప్పటికీ ఆర్ఆర్ఆర్ గురించి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక నెటిజన్ ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో గురించి స్పందిస్తూ.. సినిమాలో సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి బ్రిటిష్ వారిపై పోరాడతారన్నట్లుగా వ్యాఖ్యానించాడు. దీనికి ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ట్విట్టర్ పేజీ నుంచి సమాధానం వచ్చింది.
సీతారామరాజు, భీమ్ సినిమాలో కలిసే మాట వాస్తవమే అని.. కానీ వాళ్లిద్దరూ స్వతంత్ర పోరాటం లాంటిదేమీ చేయరని.. అన్నింటికీ మించి ఇది అసలు దేశభక్తి సినిమా కాదని ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది ఆర్ఆర్ఆర్ టీం. ఈ తరహా అంచనాలు పెట్టుకుని వస్తే ప్రేక్షకులు నిరాశ చెందుతారేమో అని జక్కన్న అండ్ కో భయపడుతున్నట్లుంది. అందుకే దేశభక్తి కోణాన్ని ముందు నుంచి కొట్టిపారేస్తోంది. తమది ఫక్తు కల్పిత, కమర్షియల్ కథ అని నొక్కి వక్కాణిస్తోంది.
This post was last modified on October 12, 2020 11:25 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…