నిన్న డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ మేం దిల్ రాజు కోసం వెయిట్ చేస్తున్నామని, ముందు ఆయన సినిమా ఉంది దానికి టికెట్ రేట్లు, స్పెషల్ షోలు ఎలా వర్తిస్తాయో మాకూ అవే ఉంటాయని చెప్పడం ఆసక్తి రేపింది. నిజానికి ఒక్కరే కాదు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది రాజుగారు ఏం చేయబోతున్నారనే దాని గురించే. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమితులయ్యాక టాలీవుడ్ నుంచి మొదటి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజరే. పుష్ప 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయి అంచనాలు, ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు దీనికే ఎక్కువగా ఉన్నాయి. అదే అసలు చిక్కు.
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షోలు, అధిక టికెట్ రేట్ల పెంపులు ఉండవని పదే పదే వివిధ రూపాల్లో సంకేతం ఇస్తోంది. సో దిల్ రాజు ఎలాంటి చొరవ తీసుకుని సమస్యను పరిష్కరిస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఒకవేళ ఆయన సక్సెస్ అయితే తర్వాత వచ్చే సినిమాలకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. లేదూ అంటే మాత్రం కలెక్షన్ల మీద ప్రభావం తప్పదు. సంధ్య థియేటర్ లో ఎవరి వల్ల ఏం జరిగిందనేది పక్కన పెడితే షోకు పర్మిషన్ ఇవ్వడం వల్లే ఒక నిండు ప్రాణం పోయిందనే భావనలో ప్రభుత్వ వర్గాలున్నాయి. ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ జరగలేదు కదానే కామెంట్స్ కి మద్దతు దక్కడం లేదు.
అసలే గేమ్ ఛేంజర్ మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన సినిమా. నైజామ్ నెంబర్లు చాలా కీలకం. మరీ వెయ్యి రూపాయల టికెట్ రేట్లు అక్కర్లేదు కానీ కనీసం ఇప్పుడు గరిష్టంగా ఉన్న 295 రూపాయలకు అదనంగా మరో వంద లేదా దేవర తరహాలో హైక్ వస్తే రికవరీ ఛాన్స్ పెరుగుతుంది. అలా కాకుండా రెగ్యులర్ రేట్లు ఉండాల్సిందేనంటే మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ వైపు వెళ్ళలేదు. దిల్ రాజు ఏదో ప్రణాళికతో సిద్ధంగా ఉంటారని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సమస్య లేదు కాబట్టి టెన్షన్ ఒకవైపే ఉంది కానీ ఇదేమి సులభంగా విడిపోయే చిక్కుముడి కాదు. చూద్దాం ఏం జరుగుతుందో…
This post was last modified on December 24, 2024 11:41 am
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…