Movie News

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతుండడం ఎంత పెద్ద వివాదానికి దారి తీసిందో తెలిసిందే. ఈ దెబ్బతో ఇకపై టాలీవుడ్ స్టార్లు జనాల్లోకి రావడానికి భయపడే పరిస్థితి తలెత్తింది. రాబోయే రోజుల్లో పెద్ద స్టార్లు ఎవరూ తమ సినిమాలు చూడ్డానికి థియేటర్లకు రాకపోవచ్చు. అదే సమయంలో పెద్ద స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్లు చేయడానికి కూడా సందేహించే పరిస్థితి తలెత్తింది.

సినిమా ఈవెంట్లకు తెలంగాణ పోలీసుల నుంచి అనుమతులు సంపాదించడం కూడా కష్టంగా మారొచ్చు. ‘దేవర’ సినిమాకు ఈవెంట్ చేద్దాం అనుకుని ఏర్పాట్లన్నీ చేశాక.. అభిమాన సందోహం అసాధారణ స్థాయికి చేరడంతో ఆ ఈవెంట్ రద్దు చేయడం తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2కు జరిగింది చూశాక సినిమా ఈవెంట్లు అంటేనే అందరూ భయపడే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం తీరును కూడా గమనించిన టాలీవుడ్ నిర్మాతలు.. రాబోయే పెద్ద సినిమాలకు హైదరాబాద్‌లో పెద్ద ఈవెంట్లు ఏవీ ప్లాన్ చేయట్లేదు.

ప్రతి పెద్ద సినిమాకూ హైదరాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్ చేయడం మామూలే. కానీ సంక్రాంతి సినిమాలు ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’లకు మాత్రం హైదరాబాద్‌లో పెద్ద ఈవెంట్ ఏదీ చేయట్లేదు. ‘గేమ్ చేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ ఒకటి ఇప్పటికే అమెరికాలో చేశారు. ఇంకో పెద్ద ఈవెంట్ ఆంధ్ర ప్రాంతంలో చేయబోతున్నారు. ‘డాకు ముహారాజ్’కు కూడా యుఎస్‌లో ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆంధ్రలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ తాజాగా వెల్లడించారు.

హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మాత్రం చిన్న స్థాయిలో చేయబోతున్నారు. మరో సంక్రాంతి సినిమా ‘సంక్రాంతికి కలుద్దాం’కు హైదరాబాద్‌లో చిన్న స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ చేయాలనుకుంటున్నారు. ఆంధ్రలో కూడా ప్రమోషనల్ ఈవెంట్ ఒకటి చేయొచ్చు. మొత్తానికి ఇటీవలి పరిణామాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెద్ద చిత్రాలకు హైదరాబాద్‌లో భారీ ఈవెంట్లు ఏవీ ఉండకపోవచ్చు.

This post was last modified on December 23, 2024 6:21 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

2 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

3 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

3 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

4 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

5 hours ago