మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే గొడవల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక దర్శకుడు వీరిలో ఒక హీరోతో సినిమా చేసి హిట్ కొడితే.. అదే దర్శకుడు తమ హీరోతో సినిమా తీస్తే ఇంకా పెద్ద హిట్ ఇవ్వాలని ఆశిస్తారు. బాబీ కొల్లికి కూడా ఇప్పుడు అదే సవాలు ఎదురవుతోంది. అతను మెగాస్టార్‌తో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరుకు ఇదే అతి పెద్ద విజయం.
ఇప్పుడు బాబీ.. బాలయ్యతో చేసిన ‘డాకు మహారాజ్’ విడుదలకు సిద్ధమైంది. ‘వాల్తేరు వీరయ్య’ గత సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయితే.. ‘డాకు మహారాజ్’ కూడా అదే పండుగ సీజన్లో విడుదల కానుంది. కాబట్టి చిరు సినిమా కంటే వసూళ్లు ఇంకా ఎక్కువ రావాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే నిర్మాత నాగవంశీ సినిమా మీద చాలా ధీమా వ్యక్తం చేస్తూ బాబీ చిరంజీవి గారితో చేసిన సినిమా కంటే ‘డాకు మహారాజ్’ బెటర్ మూవీ అని స్టేట్మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. తాజాగా ‘డాకు మహారాజ్’ టీం మీడియాను కలిసింది. ఈ సందర్భంగా ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఇది బాగుంటుందా అని ఓ విలేకరి బాబీని అడిగారు.
దీనికి బాబీ జవాబు చెప్పడానికి ముందే నాగవంశీ అందుకున్నాడు. ‘‘బాబీ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. నేను బాలయ్య గారి అభిమానిని. చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా సరే ఓ విషయం చెబుతా. ఆ సినిమా కంటే ఈ సినిమాను చాలా బాగా తీశాడు బాబీ. ఈ సినిమా కథ, విజువల్స్, టేకింగ్ అన్నీ చూసి చెబుతున్నా. కాబట్టి దాని కంటే ‘డాకు మహారాజ్’ ఇంకా బాగుంటుంది. రేప్పొద్దున థియేటర్లో సినిమా చూసిన తర్వాత అందరూ ఇదే మాట చెబుతారు’’ అని నాగవంశీ అన్నాడు. మరి వంశీ చెప్పినంత గొప్పగా ‘డాకు మహారాజ్’ ఉంటుందేమో చూడాలి.
This post was last modified on December 23, 2024 4:08 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…